రఘురామరాజు భలే ట్విస్టు ఇచ్చాడే

August 07, 2020

రాజకీయంలో రఘురామరాజు ఆరితేరాడు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, పాయింట్ల వారీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. కానీ అతను ఏ సందర్భంలోను జగన్ ను  విమర్శించలేదు. ఆ గౌరవం ఇచ్చినందుకు అయినా ఆయనను పిలిపించి వైసీపీ అధినేత జగన్ మాట్లాడాల్సింది.

జగన్ అలా చేయకపోగా జగన్ తన అనుయాయులను ఆయనపై ఉసిగొల్పారు. ఇక వ్యతిరేకులపై వైసీపీ కార్యకర్తలు ఎలా విరుచుకుపడతారో తెలుసుగా. మేము కుక్కలా విశ్వాసంగా పడున్నాం. నిన్ను కూడా జగన్ గెలిపించాడు కాబట్టి కుక్కలా మాలా విశ్వాసంలా పడుండాలి లేకపోతే రాజీనామా చేయాలి అని మంత్రి పేర్ని నాని, ఇతర ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. 

దీంతో తిక్కరేగిన ఎంపీ రాజు జగన్ వల్ల కూడా నాకు ఓట్లు పడ్డాయి గా కేవలం జగన్ వల్ల వచ్చిన ఓట్లోతనే గెలవలేదు అని అన్నారు. ఇక తనపై విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను పందులు గుంపులుగా వస్తాయంటూ సినిమా డైలాగ్ చెప్పారు. 

దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దూషణల దాకా వెళ్లాయి. అమెరికా సింగపూర్ల నుంచి పచ్చిబూతులు తిడుతూ రాజుకు ఫోన్లు వచ్చాయి. దిష్టిబొమ్మలు తగలబెట్టారు. నువ్వు ఎలా తిరుగుతావో చూస్తాం అన్నారు. అయితే వెనక్కు తగ్గని రాజు మంచి మాటలు చెబితే నా మీదకు వస్తారా... పచ్చి అవినీతి పరులు, దొంగలు అంటూ వారిపై విరుచుకుపడ్డారు.

వ్యవహారం శృతిమించడంతో రాజుకు షో కాజ్ నోటీసు వచ్చింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరు మీద 18 పేజీల లేఖ వచ్చింది. అందులో 16 పేజీలు క్లిప్పింగులే ఉన్నాయి. 

దీనిపై స్పందించిన రఘురామరాజు నాకు ఏడు రోజులు స్పందించడానికి సమయం ఇచ్చారు. అంత సమయం నాకు అవసరం లేదు. రేపే నేను రిప్లై ఇస్తాను. ఆరోజు, ఈరోజు నాకు పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద అపారమైన గౌరవం ఉంది. ఏనాడు నేను పార్టీని, పార్టీ అధ్యక్షుడిని ఏమీ అనలేదు. కేవలం జరుగుతున్న తప్పులనే అపాయింట్ మెంట్ దొరక్కపోవడం వల్ల మీడియా ద్వారా చెప్పాను అంటూ ఒక వీడియో విడుదల చేశారు రఘురామరాజు.