జగన్ ని రాజుగారు భలే ఇరికించారే !

August 08, 2020

ఈ మధ్య నరసాపురం ఎంపీ రఘురామరాజుగా లేఖాసురుడిగా మారిపోయారు. ప్రతి విషయానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ నిబంధనలకు లోబడి, మర్యాద ఏ మాత్రం తగ్గకుండా జగన్ కు లేఖలు రాస్తున్నారు. కానీ ఒక్కో లేఖ జగన్ ని మాత్రం బాగా ఇరిటేట్ చేస్తోంది. తాజాగా శ్రావణ శుక్రవారం రోజు మరో లేఖ రాశారు. చిన్న కోరిక కోరారు.. కానీ జగన్ ఆ కోరిక తీరుస్తాడా? అంటే లేదనే చెప్పాలి. రాజు గారు అడిగినందుకు అయినా ఆయన అదేపనిగా ఆ కోరిక తీర్చకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇంతకీ రఘురామకృష్ణంరాజు కోరిన కోరిక ఏంటి?

‘‘అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగష్టు 5 తేది చేస్తున్న భూమి పూజ కార్యక్రమం భారత దేశ చరిత్రలో ఒక మైలు రాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోట్లాది మంది ప్రజల చిరకాల వాంఛ. ఈ భూమి పూజ కార్యక్రమం భారత దేశ చరిత్రలోను మరియు కోట్లాది మంది ప్రజల హృదయలలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగే ఆగష్టు 5 వ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపఠనం నిర్వహించేలా దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించాలని మరియు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోని "శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్" లో ప్రత్యక్షప్రసారం చెయ్యాలని ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్ మోహన రెడ్డి గారిని కోరుతున్నాను.‘‘ అంటూ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ప్రకటించుకున్న క్రిస్టియన్. అదేపనిగా రాజు గారు వైఎస్ జగన్ ను గిల్లడం కోసమే లేఖ రాసినట్లుగా ఉంది. అయితే, రఘురామరాజు కోరికలో ఏ తప్పు గాని పొరపాటు గాని లేదు. కానీ అది ముఖ్యమంత్రి ఇష్టఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రజలకు మాత్రం రఘురామరాజు సలహా నచ్చేలా ఉంది.