జగన్ కి దొరకనివి.... ఈయనకెలా దొరుకుతాయబ్బా?

August 14, 2020

రఘురామరాజు రకరకాలుగా తమ అధినేత జగన్ ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.ఎవరు కాదన్నా, అవునన్నా రఘురామరాజు టార్గెట్ వైసీపీయే అని ఆయన వేసే అడుగులు చెబుతున్నాయి.

ఒకవైపు జగన్ పాతికేళ్లు సీఎంగా ఉండాలి అంటారుమరోవైపు జగన్ ఎక్కడెక్కడ ఫెయిలయ్యారో అందరికీ చెబుతారు.లేఖలు రాసి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతారు. షోకాజ్ నోటీసును కామెడీ చేసి వైసీపీ పరువు తీశాడుఎన్నికల కమిషన్ వద్ద పార్టీని ఇరుకున పెట్టాడు.

ఇదంతా ఒకెత్తు అయితే... జగన్ చేయొద్దన్న పనిని చేస్తున్నారు. సాయిరెడ్డికి చెప్పకుండా కేంద్రంలో ఎవరినీ కలవొద్దని చెప్పినా బీజేపీ పెద్దలను కలుస్తున్నాడు. అది కూడా జగన్ కు దొరకని అప్పాయింట్ మెంట్లు రఘురామరాజుకు దొరుకుతున్నాయి. 

ఒక ఎంపీకి దొరికే అపాయింట్మెంట్లు ఆ పార్టీ అధినేతకు దొరక్కపోవడం ఒక వింత.ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావడమే లేదు. సస్పెండ్ చేస్తే స్వేచ్ఛ ఇచ్చినట్టవుతుందని... సస్పెండ్ కూడా చేయడం లేదు.

పైగా బయటకు వచ్చి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదు. సరదాగా కలిశాను అంతే అంటున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పదేపదే బీజేపీ పెద్దల అప్పాయింట్మెంట్లు రాజుగారికి దొరకడం వెనుక కారణం ఏంటో??