రాజు గారా మజాకా... బ్యాగ్రౌండ్ పెద్దదే !

August 05, 2020

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి  అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీకి సడెన్ గా నిన్న రఘురామ రాజు కొన్ని కొత్త షాకులు ఇచ్చారు. చంద్రబాబును, పవన్ ను ఎదుర్కోవడం రఘురామరాజుకు పెద్దగా కష్టం అనిపించడం లేదు గాని... రఘురామరాజును ఎదుర్కోవడం యు.శ్రా.రై. కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది.

నిన్న ఆయన తనకు ఏపీలో లేని పార్టీ నుంచి షోకాజ్ నోటీసు రావడంపై ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఆ తర్వాత ఆయన వాట్సప్ డీపీ మారిపోయింది. రాజ్ నాథ్ సింగ్ తో గతంలో బేటీ అయిన ఫొటోను రఘురామరాజు పెట్టుకున్నారు. చైనా, ఇండియా సరిహద్దు వివాదాల సమయంలో రక్షణ శాఖ మంత్రి, బీజేపీ కీలక నేత రాజ్ నాథ్ సింగ్ సమయం ఎవరికీ దొరకడం లేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఆయా విభాగాలు, అంతర్జాతీయ మీటింగులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసాధారణ ఎంపీ కాదు కదా... బీజేపీ కీలక నేతలకు కూడా వారి అపాయింట్మెంట్ దొరకడం లేదు.

అప్పాయింట్మెంట్లు చాలా టైట్ గా ఉన్న సమయంలో ఇలాంటి సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రఘురామరాజుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 

ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఒక ఎంపీకి రక్షణ మంత్రి అపాయింట్మెంట్ దొరకడంపై అందరూ నోరెళ్లబెట్టారు. దీన్ని బట్టి రఘురామరాజు కెపాసిటీ ఏంటో వైసీపీకి క్లియర్ గా అర్థమైపోయింది. రాజు గారి రేంజ్ ఈ స్థాయిలో ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. 

ఇదే ట్విస్ట్ అనుకుంటుంటే .. అర్ధరాత్రి గంట పాటు రఘురామరాజుకి లోక్ సభ స్పీకర్ సమయం కేటాయించారు. తనను బెదిరించిన రికార్డులను రాజుగారు స్పీకరుకు అందజేశారు. ఓఎస్డీ సాయంతో హోం శాఖతో అనుసంధానం చేసుకుని ప్రత్యేక భద్రత కల్పిస్తామని లోక్ సభ స్పీకరు రాజుగారికి భరోసా ఇచ్చారు. రాజుగారు ఒక్కో స్టెప్ వేస్తుంటే యువజన శ్రామిక రైతు పార్టీ అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ అని అద్దె పేరుతో పిలుస్తారు కదా ఆ పార్టీకి ఏం చేయాలో తెలియని విషాదకరమైన అగమ్యగోచర పరిస్థితి ఉంది. 

ఆయనను సస్పెండ్ చేయాలన్నా కూడా భయమే. ఏకంగా ఎన్నికల సంఘంతోనే ఫిటింగ్ పెట్టాడు. ఇపుడు పార్టీ పేరుకే ముప్పు తెచ్చాడు.