కోమటి ఇంట పెళ్లి వేడుక... అంగరంగ వైభవంగా కొడుకు వివాహం

August 03, 2020

అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాసాంధ్ర ప్రముఖుడు, అక్కడి మనోళ్ల వ్యవహారాల పర్యవేక్షణకు ఏర్పాటైన తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ఇంట పెళ్లి గంట మోగింది. కోమటి జయరాం, కోమటి కల్పనల కుమారుడు కోమటి రాహుల్ పెళ్లి వేడుక నేడు అంగరంగ వైభంగా జరిగింది. ఇటలీకి చెందిన జార్జియో జియార్నో, జూలీ గూడాకిర్ ల కుమార్తె ఇసబెల్లాతో రాహుల్ వివాహం జరగనుంది. శనివారం జరగనున్న ఈ వేడుకకు అమెరికాలో స్థిరపడిన ప్రవాస తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యాపార, రాజకీయ రంగంలో రెండింటిలో రాణించిన కోమటి జయరాం అత్యధికులను పెళ్లికి ఆహ్వానించారు. దీంతో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఫెయిర్ మోంట్ హోటల్ వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.50 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రవాస అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా ముహూర్తానికి ముందు ఉదయం 10 గంటలకు బారాత్ ను నిర్వహించారు. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భారీ విందు ఏర్పాటు చేశారు.

కోమటి జయరాం అమెరికాలోనే కాకుండా వివిధ దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస తెలుగు ప్రజలకు చిరపరచితులే. గతంలో తానాకు అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. తానా కార్యవర్గంలో చాన్నాళ్ల పాటు కొనసాగిన జయరాం... టీడీపీ హయాంలో అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఈ తరహా కీలక పదవులతో అమెరికా, భారత్ ల మధ్య సంబంధాలతో పాటుగా అమెరికా, ఏపీ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలక భూమిక పోషించారు. విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళుతున్న తెలుగు యువతకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం, ఏదేని సందర్భాల్లో తెలుగు నేలకు చెందిన వారికి అమెరికాలో ఇబ్బందులు ఎదురైతే... అన్నీ తానే అయ్యి వ్యవహరించడంలో జయరాం కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు. ఇలాంటి క్రమంలో కోమటి జయరాం ఇంట పెళ్లి వేడుక అంటే... అమెరికాలోని ఏపీ వాసులకే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇంపార్టెంట్ ఈవెంట్.  ఈ క్రమంలోనే కోమటి జయరాం కుమారుడి పెళ్లి వేడుకకు అమెరికాలో ఉంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులతో పాటుగా భారత్, అమెరికాకు చెందిన ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తంగా కోమటి రాహుల్ పెళ్లి వేడుక చాలా మంది తెలుగు వారి
ని ఒక వేదిక మీదకు తెచ్చింది. అమెరికాలో ఎంత పెద్ద వారింట పెళ్లిళ్లు జరిగినా 200 మంది రావడం చాలా కష్టం. కానీ... చాలా పెద్ద సంఖ్యలో పలువురు హాజరుకావడం స్థానిక అమెరికన్లలో మరోసారి ఇండియన్ పెళ్లిళ్లపై చర్చ జరిగేలా చేసింది. 

 

RELATED ARTICLES

  • No related artciles found