సూపర్ పాయింట్ లేవనెత్తిన రాహుల్ గాంధీ !

August 06, 2020
CTYPE html>
గతం గత: రాహుల్ గాంధీ 2020లో బ్రహ్మాండంగా ఫర్ ఫాం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ 19 విషయంలో అతను గవర్నమెంటు కంటే ముందే ఉన్నాడు. కరోనా వల్ల దేశం పడే ఆరోగ్య ఇబ్బందులు, తదనంతరం పడే ఆర్థిక ఇబ్బందుల గురించి రాహుల్ చాలా ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. 
తాజాగా వారం క్రితం విదేశీ కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన కంపెనీలకు ఫండ్ చేసి మన ఎకానమీని చేజిక్కించుకునే ప్రమాదం కనిపిస్తుందని రాహుల్ సూచన చేసిన తర్వాతే కేంద్రం మేల్కొంది. సరిహద్దు దేశాలు (ముఖ్యంగా చైనాను ఉద్దేశించి) మన దేశపు కంపెనీలలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది. అంటే చైనా కంపెనీలు ఏవీ మన దేశానికి చెందిన కంపెనీలను అక్వయిర్ చేయలేవు. తన సలహా విని ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్జతలు అంటూ రాహుల్ గాంధీ మోడీతో అన్నారు.
అయితే... తాజాగా మరో అద్భుతమైన పాయింట్ ను తెరమీదకు తెచ్చారు రాహుల్. బహుశా ఈ నిర్ణయం వెనుక ఇటీవలే కాంగ్రెస్ మన్మోహన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కోవిడ్ టీం ఉండొచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ నుంచి మరో మంచి సూచన మోడీకి అందింది... అదేంటంటే... కరోనా నివారణలో అత్యంత కీలకంగా మారిన శానిటైజర్స్ 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్నాయని... వెంటనే ఆ శ్లాబు నుంచి వాటిని తొలగించాలని రాహుల్ కోరారు. ఇవి ప్రజలకు ఎంత అందుబాటులోకి వస్తే అంత మంచిది అన్నారు. ఇపుడు శానిటైజర్ అనేది ఒక నిత్యావసరం.  ప్రతి ఇంటికి తిండితో పాటు ఇది అవసరం. అలాగే మాస్కు కూడా 5 శాతం శ్లాబులో ఉంది. ఈ రెండింటినీ కరోనా పై విజయం సాధించేవరకు జీఎస్టీ నుంచి మినహాయించమని రాహుల్ కోరుతున్నారు. ఇది మంచి ఆలోచనే. అంటే 50 రూపాయల శానిటైజర్ పై 9 రూపాయల జీఎస్టీ అంటే భారమే. ఎందుకంటే మనిషికి వారానికి రెండు అయిపోతాయి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికీ ఇదే భారం. కాబట్టి తాత్కాలికంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు వీటిని మినహాయించడం మంచిదే.