ముఖ్యమంత్రికి క్లాస్ పీకాడు !!

July 08, 2020

ఆర్టికల్ 370 రద్దు... అంతర్జాతీయంగా ఒక సీరియస్ చర్చ. కానీ ఇండియాలో దాని చుట్టూ చర్చతో పాటు సెటైర్లు కూాడా పేలుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు మంచి రంగుతో పుట్టాలని దేశ వ్యాప్తంగా గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం పరిపాటి. మరి ఆ కుంకుమ పువ్వుల ప్రభావమో లేక.. అక్కడి జీన్స్ అంతనో గానీ అక్కడి అమ్మాయిలు మంచి శరీర వర్ణంతో ఆకట్టుకుంటుారు. చల్లని ప్రాంతం కావడం వల్ల సుకుమారంగా కూడా ఉంటారు. ఇంతకాలం కశ్మీరీ అమ్మాయిను భారతీయులను పెళ్లాడేవారు కాదు. ఎందుకంటే ... వారి ఆస్తులను కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఆర్టికల్ 370 రద్దుతో... ఇపుడు వారికి ఆ ప్రమాదం తప్పింది.
దేశ వ్యాప్తంగా కశ్మీరీ అమ్మాయిల గురించి వ్యాఖ్యలు, జోకులు వినిపిస్తున్నాయి. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సరదా వ్యాఖ్యలు చేశారు. **ఇక అందరి చూపు అందమైన కశ్మీరీ అమ్మాయిలపైనే ఉంటుందని, వారిని కోడళ్లుగా, భార్యలుగా తెచ్చుకునేందుకు మొగ్గు చూపుతారు** అంటూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. పురుషులు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదు అని కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయికి ఈ వ్యాఖ్యలు తుచ్ఛమైనవని అంటూ మండిపడ్డారు.
వాస్తవానికి సోషల్ మీడియాలో కశ్మీర్ అమ్మాయిల గురించి అనేక సరదా కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా హర్యానాలో అమ్మాయిల కొరత చాలా ఎక్కువ. బహుశా కశ్మీరీ అమ్మాయిల వల్ల తమ అబ్బాయిలకు మరొక అవకాశం దొరికిందన్న అర్థంలో సీఎం అని ఉండొచ్చు. అయినా... కూడా సీఎం స్థాయి వ్యక్తికి ఈ మాటలు సరైనవి కావు. ఆర్ఎస్ ఎస్ శిక్షణలో ఇలాంటి వారు తయారవుతున్నారా అంటూ రాహుల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.