బుక్కైపోయిన ఎన్టీఆర్, సుకుమార్

August 02, 2020

RRR అప్ డేట్ వస్తుందనుకుని సంబరపడకండి. అది #BeTheRealmen ఛాలెంజ్ వీడియో.

దర్శకుడు సందీప్ వంగా #BeTheRealmen అంటూ దర్శకుడు రాజమౌళికి విసిరిన ఛాలెంజ్ ను చాలా సరదాగా స్వీకరించిన రాజమళి ఆ టాస్క్ కంప్లీట్ చేసి తాజాగా తన మాజీ నిర్మాత శోభను, దర్శకుడు సుక్కును ఇరికించాడు. వీళ్లతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా రాజమౌళి ఇంటి పనులు అప్పగించేశారు. అంటే వారు రేపు ఇంటి పనులు చేసి ఆ వీడియో రిలీజ్ చేస్తారన్నమాట. 

రాజమౌళి ఇంటి పనులు... అపుడపుడు చేస్తుంటారు. కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం. తాజాగా ఈ చాలెంజ్ ఎన్టీఆర్, చరణ్, సుక్కు, శోభు యార్లగడ్డ లకు విసిరాడు. మరి వీరిలో రాంచరణ్ తప్ప ఇతరులు ఇంటి పనులు చేసినట్టు వినలేదు. చూడలేదు. మరి సడెన్ గా ఇలా ఇరికిస్తే ఎలా రాజమౌళి గారు? అన్నయ్య కీరవాణిని కూడా ఇరికించారు. పాపం... ఆయనకు ఈ వయసులో ఆ భారం అవసరమా రాజమౌళి గారు.. చూద్దాం రేపు వీళ్లందరి వీడియోలు. ఆ తర్వాత వీళ్లెవరికి ఛాలెంజ్ విసురుతారో చూడాలి.