50 లక్షలు రాజమౌళి ఏం చేశాడంటే...

February 24, 2020

నలుగురికి ఏదైనా మంచి చేసే అవకాశం వస్తే ఏ మాత్రం వెనుకడుగు వేయరు దర్శకుడు రాజమౌళి. మానవ సంక్షేమం గురించి సామాజిక, ప్రాకృతిక సంక్షేమానికే ఆయన పెద్ద పీట వేస్తుంటారు. సమాజ సేవా కార్యక్రమాలకు కాదనకుండా వస్తారు.
తాజా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దర్శకులను ఆదుకోవడానికి కె.రాఘవేంద్ర రావు పది లక్షల రూపాయల ప్రాథమిక నిధితో ‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్‌ (టీఎఫ్‌డీటీ) ఏర్పాటుచేశారు. దీనిని ఆవిష్కరించిన చిరంజీవి పాతి లక్షల విరాళం ప్రకటించారు.
తాజాగా దీనిపై స్పందించిన దర్శకుడు రాజమౌళి రూ.50 లక్షల భారీ విరాళం అందించారు. ఆర్కే మీడియా సంస్థ రూ. 15 లక్షలు ప్రకటించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక భారీ నిధిని ఏర్పాటు చేసి, ఆ సొమ్ము ద్వారా వచ్చే వడ్డీని కష్టాల్లో వున్న దర్శకుల కుటుంబాలకు అందిస్తామని రాఘవేంద్రరావు చెప్పారు.

ఈ ట్రస్ట్ కు యథావిధిగా తెలంగాణ కోటాలో మేనేజింగ్ ట్రస్టీగా ఎన్. శంకర్ ను ఎంపిక చేసేశారు. కె. రాఘవేంద్రరావు చైర్మన్‌ అయ్యారు. ట్రస్టీలుగా వి.వి.వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్ర‌సాద్‌, కాశీ, బి.వి.ఎస్‌.ర‌వి వ్యవహరిస్తారు. ట్రెజరర్ పోస్టును కనిపించకుండా పోయిన మెహర్ రమేశ్ కు ఇచ్చారు.