రాజమౌళి మీద మరో బిగ్ గాసిప్

August 05, 2020

అసలే ఉన్న తలనొప్పులు చాలవంటే కొత్త టెన్షన్ నెత్తి మీద పడినట్టుంది.  సినీ అభిమానుల పరిస్థితి. రాజమౌళి మీద ఇంతవరకు వచ్చిన గాసిప్స్ లో చాలావరకు నిజం అయ్యాయి. RRR కూడా అధికారికంగా ప్రకటన రాకముందే మల్టీ స్టారర్ అని, అందులో రామ్, ఎన్టీఆర్ చేస్తున్నారని కూడా బయటకు వచ్చింది. రెండేళ్లు వెయిట్ చేయించి జనమంతా జట్టు పీక్కుంటూ టెన్షన్ తట్టుకోలేక ఎపుడు ఎపుడు అని ఎదురుచూస్తుంటే... 2020 మార్చి, 2020 దసరా యే అని చెప్పి చెప్పి ఊరించి ఊరించి వచ్చ ఏడాది 2021 సంక్రాంతి అని బాంబు పేల్చాడు. తీరా చూస్తే దాన్ని కూడా కరోనా నెరవేర్చేలా కనిపించడం లేదు. ఇంతలో ఆ సినిమా మీద ఆశలు పెట్టుకున్న అభిమానుల ఉత్కంఠ నరాలు తెగిపోయేలా ఉంది.

ఇపుడు తాజాగా రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటూ గాసిప్ బయటకు వచ్చింది. ఇపుడు తల ఏ గోడకు కొట్టుకోవాలి. అసలు నిజం ఏంటో తెలియదు. కాదనలేం అవుననలేం. జరగదేమో అని ఒకవైపు, జరిగితే బాగుండు అని ఆశ ఒకవైపు మొత్తానికి దాని గురించి ఇపుడు కొత్త ఉత్కంఠ మొదలైంది. లాక్ డౌన్లో జనం వారి మానాన వారు మాడిపోయిన మసాలా దోశ తింటూ సినిమాలు, వార్తలతో టైం పాస్ చేస్తుంటే మధ్యలో ఈ రాజమౌళి మహేష్ వార్త పెద్ద చర్చగా మారేలా ఉంది. 

రాజమౌళి గారు మాకీ ఉత్కంఠ ఎందుకు? అసలే కరోనా వేళ రోగనిరోధక శక్తి ఎక్కువ అవసరం.  ఎంత ప్రశాంతంగా ఉంటే అది అంత బాగా పెరుగుతుంది. మీరు వెంటనే ఇది నిజం అయితే, నిజమని చెప్పండి. అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి... దయచేసి చోద్యం చూస్తూ కూర్చోవద్దు అని అశేష అభిమానులు అడుగుతున్నారు. ఇది ఇంత చర్చ దారితీయడానికి కారణం ఏంటంటే... విజయేంద్రప్రసాద్ ఇచ్చిన హింట్. ఇంతవరకు పెద్ద హీరోలు అనదగ్గ వారిలో మహేష్, అల్లుఅర్జున్ లతోనే రాజమౌళి సినిమా చేయలేదు. బహుశా ఇది కూడా ఒక కారణం ఈ గాసిప్ కి. వాస్తవం మాట్లాడుకుంటే రాజమౌళి తరహా సినిమాలకు మహేష్ కంటే బన్నీ కొంచెం ఎక్కువ సూటవుతారేమో మరి. కానీ రాజమౌళి తలచుకుంటే ఎవరికైనా అనుగుణంగా కథ మలచగలరు. అది వేరే విషయం అనుకోండి.