సంచలనం : రాజ్ భవన్ కి పాకిన కరోనా

August 04, 2020

ఏపీలో ముఖ్యమంత్రి కరోనాను ఎంత దాచిపెడదామని ప్రయత్నించే అది దాగే రకం కాదు. దాచిపెట్టే కొద్దీ హద్దులు మీరుతుంది. తాజాగా ఏపీ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ లో నలుగురికి కరోనా సోకింది. ఇందులో గవర్నర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరుకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు మరో ముగ్గురు సిబ్బందికి కరోనా సోకింది. ఈ ముగ్గురులో ఒకరు వైద్య సిబ్బంది. నిత్యం గవర్నరు చుట్టూ ఉండేవారికి సోకిందంటే... గవర్నరు హరిచందన్ పరిస్థితి ఏమిటో ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఆయనకు టెస్టులు చేసినదీ లేనిదీ కూడా తెలియడం లేదు. 

ఏపీలో మూడో దశకు కరోనా చేరిన నేపథ్యంలో ముఖ్యుల నివాస గృహాల్లో సిబ్బందిని ఇంత ఆలస్యంగా పరీక్షించడం గమనార్హం. ఏప్రిల్ మొదట్లోనే చర్యలు తీసుకుని ఉండాల్సింది. కానీ కరోనాను సీరియస్ గా తీసుకుంటే ఎన్నికల విషయంలో తాను చేసిన పని తప్పవుతుందన్న భావనలో జగన్ కరోనా ను ప్రధాన విషయంగా గుర్తించడం లేదు. దీంతో ఇది రాష్ట్రంలో ప్రమాదకరమైన స్థితికి వెళ్లింది. కంటైన్ మైన్ జోన్ల నిర్వహణ కూడా ఏం బాగోలేదు. దీనిపై ఇటీవలే ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ చర్యలపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అదే సమయంలో తెలంగాణలో చర్యలపై సంతృప్తి వ్యక్తంచేసింది. 

ఇప్పటికి కూడా ఎన్నికలే ప్రధానంగా భావిస్తున్న ఏపీ సర్కారు ఆయా నేతలను నిత్యం ఫీల్డులో ఉండమని ఆదేశించింది. దీంతో వారు ర్యాలీలు, సభలు పెట్టి కోవిడ్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. ఇప్పటికే వీరి చర్యలను జాతీయ మీడియా తూర్పారబట్టింది. శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట తదితర చోట్ల వైసీపీ నేతల తీరుతో ప్రజలు చిక్కుల్లో పడ్డారు. కరోనా విపరీతంగా వ్యాపించింది. ఇక కర్నూలు జిల్లా అయితే మహానగరాలతో పోటిపడుతోంది. 

RELATED ARTICLES

  • No related artciles found