రజనీ పొలిటికల్ ఎంట్రీ.. కీలక అప్ డేట్

July 15, 2020

ఎప్పుడా? మరెప్పుడా? అంటూ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయం దగ్గర్లోకి వచ్చేసినట్లే. తమిళ రాజకీయాల్ని మార్చేసేందుకు వీలుగా తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అవేమీ ఇప్పటివరకూ నిజం కాలేదు. కానీ.. ఈసారి మాత్రం అలాంటి వార్తల్ని విని ఎంజాయ్ చేసే టైం రజనీకి ఉండకపోవచ్చంటున్నారు.
ఎందుకంటే.. రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి సీరియస్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని.. తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు కాస్త ముందుగా తన పొలిటికల్ విల్ ను రివీల్ చేయటం ఖాయమంటున్నారు. దీనికి ముందు రజనీ ఒక సినిమాకు ఆయన ఓకే చెప్పేశారట.
ఇటీవల విడుదలై చక్కటి విజయాన్ని అందించటమే కాదు.. దర్శకుల సినిమాగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఖైదీ దర్శకుడు లోకేశ్ కు తమిళ సూపర్ స్టార్ తో సినిమా ఛాన్స్ కొట్టేసినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఫుల్ బిజీ కావటానికి ముందే.. రజనీ షూటింగ్ పోర్షన్ పూర్తి చేస్తారన్న మాట వినిపిస్తోంది. రజనీని లోకేశ్ కనకరాజు ఎలా చూపిస్తారో చూడాలి మరి?