బీజేపీ గురించి ఈ గాసిప్ నిజమేనా?

July 13, 2020

ఉత్తరాది దండయాత్రను పూర్తిచేసిన బీజేపీ... దక్షిణాదిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా దక్షిణాదిన బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణలో శరవేగంగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో తమిళనాడు, ఏపీలోనూ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఇతర రాష్ట్రాల్లో సీట్లు... అనే నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలసీతో ముందుకు పోతోంది.
తమిళనాడు బీజేపీ గురించి ఒక గాసిప్ వైరల్ అవుతోంది. ఆయనకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా తమిళులు ఇతరులను పెద్దగా తమ పరిధిలోకి రానీయరు. అందుకే బీజేపీ కూడా తమిళనాడులో భారీ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉంటే తప్ప కనీసం అసెంబ్లీలో కూడా ఎంటర్ కాలేమని కనిపెట్టింది. మరోవైపు రాజకీయాల్లో ఎటు పోవాలో తెలియక ఊగిసలాడుతున్న రజనీకి ఒక సూపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ పెట్టుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి.. దానికంటే... బీజేపీలో చేరితే మీ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని చెబుతున్నారట కమల పార్టీ అధక్ష్యుడు.
రజనీ కాంత్ బీజేపీలో చేరితో తమిళనాడు పార్టీ పగ్గాలను పూర్తిగా అప్పగించడమే కాకుండా... బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారట. ఈ మేరకు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. రాజకీయాల్లో ఇది హాట్ గాసిప్ అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రధాని మోదీ, అమిత్ షాలు వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమిత్ షా, మోడీలను రజనీ కృష్ణార్జునులుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.