ఈ ఇద్దరి అరుదైన రికార్డు ఏంటంటే....

June 01, 2020

సాహో సినిమా సందర్భంగా ఒక అరుదైన రికార్డు బయటకు వచ్చింది. ఇది రోమాలు నిక్కబొడుచుకునే రికార్డు. ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమైన రికార్డు. సౌత్ ఇండియాలో ఏ హీరోకి ఏ ట్యాగ్ ఇచ్చినా... అసలు సూపర్ స్టార్ లు మాత్రం ఆ ఇద్దరే. అయితే, ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా??.

దక్షిణ భారతదేశం మొత్తం మీద బాక్సాఫీసును కుమ్మేసిన ఆరు టాప్ సినిమాలు ఇద్దరు హీరోలవే కావడం ఇక్కడ విశేషం. అందులో రెండు సీక్వెల్స్. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు, రజనీకాంత్ - ప్రభాస్. రజనీ నటించి రోబో 1, రోబో 2 సినిమాలు టాప్ జాబితాలో ఉన్నాయి. అలాగే ప్రభాస్ నటించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు కూడా టాప్ 5లోనే ఉన్నాయి. తమషా ఏంటంటే... మిగతా రెండు స్థానాలు కూడా వీరు నటించిన సినిమాలవే. అవి సీక్వెల్స్ కాదు. రజనీ కబాలి. ప్రభాస్ సాహో. 

వరుసగా స్థానాలు చూస్తే...

  1. బాహుబలి -2
  2. రోబో-2
  3. బాహుబలి 
  4. రోబో 
  5. కబాలి  

ఇవి సాహో విడుదలకు ముందు దక్షిణ భారతదేశంలో టాప్ కలెక్షన్స్ సాధించిన ఐదు సినిమాలు. ఇపుడు తాజాగా వచ్చిన ప్రభాస్ సాహో వీటిలో చేరిపోయింది. రోబో1, కబాలిని వెనక్కు నెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించింది సాహో. రోబో, కబాలి 4,5 స్థానాల నుంచి 5,6 స్థానాలకు జరిగారు. ఏది ఏమయినా... మొదటి ఆరు సినిమాలు ఇద్దరు హీరోలవే కావడం కచ్చితంగా ఆశ్చర్యం, విశేషం.