రజనీకాంత్ రచ్చ ఈసీకి తలనొప్పి

July 06, 2020

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా త‌ప్పులు జ‌రిగిన‌ట్లుగా ఒక ప‌ట్టాన ఒప్పుకోని ఎన్నిక‌ల సంఘం అధికారులు.. తాజాగా త‌మ త‌ప్పును ఒప్పుసుకున్న వైనం త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటు వేయ‌టానికి చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో ఓటేశారు. అయితే.. దీనిపై కొంద‌రు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. రూల్స్ ప్ర‌కారం ఓటు వేసే ముందు ఓట‌రు ఎడ‌మ‌చేతి చూపుడు వేలికి లేదా.. ఎడ‌మ చేతిలోని ఏదో ఒక వేలికి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ.. ర‌జ‌నీకాంత్ ఓటు వేసే స‌మ‌యంలో.. అక్క‌డ ఎన్నిక‌ల విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది పొర‌పాటున ఎడ‌మ చేతికి కాకుండా కుడి చేతికి సిరా చుక్క వేశారు.
రూల్ బుక్ ప్ర‌కారం అలా చేయ‌టం త‌ప్పు అవుతుంది. ఇదే విష‌యాన్ని కొంద‌రు ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్ల‌గా.. జ‌రిగిన త‌ప్పును ఒప్పుకుంటూ ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న చేసింది. ఇలా ఎందుకు జ‌రిగింద‌న్న విష‌యానికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ ప్రిసైడింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
అంత పెద్ద సూప‌ర్ స్టార్ వ‌చ్చి ఓటు వేస్తున్న ఆనందంలో ఎన్నిక‌ల సిబ్బంది పొర‌పాటున ఒక చేతికి వేయాల్సిన సిరాచుక్క‌ను మ‌రో చేతికి వేసి ఉంటార‌ని భావిస్తున్నారు.