రోజా అతితెలివికి ... అనిత కౌంటర్ - అదిరిపోలా !!

August 15, 2020

తెలివి ఎవరి సొత్తు కాదు. ఊరికే నోరు పారేసుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. పాపం నిత్యం తనకు తోచించి మాట్లాడి ప్రతిపక్షంపై విమర్శలు చేసే రోజాకు తెలుగుదేశం నేత వంగలపూడి అనిత ఘాటు కౌంటర్ ఇచ్చారు. అధికారం ఉన్నపుడు చంద్రబాబుకు క్యాష్ గుర్తొచ్చింది, అధికారం పోయాక క్యాస్ట్ గుర్తొచ్చింది అని చంద్రబాబు మీద రోజా విమర్శలు చేసింది. వర్ల రామయ్యకు టిక్కెట్ ఇవ్వడం గురించి రోజా ఈ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

దీనికి తీవ్రంగా స్పందించిన అనిత వంగలపూడి... ఘాటు కౌంటర్ ఇచ్చింది నగరి ఎమ్మెల్యే రోజాకి. ఎదుటి వారిని విమర్శించే ముందు సొంత పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుని రోజా మాట్లాడితే మంచిది. లేకపోతే మీ పార్టీ పరువు మీరే తీసుకునే పరిస్థితులు వచ్చాయని అన్నారు.

దళితులు వైసీపీకి ఓటు బ్యాంకు మాత్రమే, అని... తెలుగుదేశం పార్టీని విమర్శించే ముందు వైసీపీ నుంచి పోటీ చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో దళితులు ఉన్నారా లేదా... తెలుసుకుని మాట్లాడాల్సింది రోజా గారు అంటూ కౌంటరేశారు అనిత. నలుగురిలో ఒక్కరు కూడా దళిత అభ్యర్థి లేరని... సంపన్నులకు సీట్లు కట్టబెట్టారని అనిత వైసీపీపై విమర్శలు చేశారు.

రెండున్నర లక్షల బడ్జెట్లో కేవలం 4300 కోట్లు మాత్రమే దళితులకు కేటాయించిన మీరు దళితుల క్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రపంచం సిగ్గుపడుతుందన్నారు. వారు టీడీపీని విమర్శించడం గురివింద సామెతలా ఉందన్నారు.