రాజ్యసభ ఎన్నికలు జూన్ 19, లెక్కింపు ఆ రోజే

July 03, 2020

రాజ్యసభ ఎన్నికలకు తేదీ వచ్చేసింది. మార్చి 26న జరగాల్సి ఉన్న ఈ ఎన్నికలు లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డాయి. తాజాగా జూన్ 19వ తేదీని 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. 

జూన్ 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా... ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి 5 గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు.

వైసీపీ అభ్యర్థులు 

పిల్లి సుభాష్ చంద్రబోస్

మోపిదేవి వెంకటరమణ

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

పరిమళ్ నత్వాని (అంబానీ మనిషి)

టీడీపీ అభ్యర్థి

వర్ల రామయ్య

టీడీపీ గెలిచే అవకాశం లేకపోయినా... జగన్ అహంకారానికి చెక్ పెట్టడానికే అభ్యర్థిని నిలిపినట్లు అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

ఇదిలా ఉండగా... మొత్తం ఖాళీ అయిన సీట్లు 55 కాగా 37 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలతో జగన్ కి బూస్ట్ వచ్చింది. త్వరలో పంచాయతీ రాజ్ ఎన్నికలకు తెరతీసే అవకాశం కనిపిస్తోంది.