​బెల్లంకొండకూ ఓ రోజొచ్చింది - ఇండస్ట్రీని ఊపేశాడుగా !!​

May 29, 2020

పరిచయమే లేని హీరో... కానీ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. మొదటి సినిమాతోనే అందరికీ షాక్ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. అదేంటో గాని అతని సినిమాలు కొన్ని నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టాయి గాని బెల్లంకొండకు ఏ క్రెడిట్ ను ఇవ్వలేకపోయాయి. సాక్ష్యం, సీత వంటి లేటెస్ట్ ఫ్లాపులతో అతని కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా... తన విశ్వరూపం చూపించారు బెల్లంకొండ.

సాధారణంగా బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో సహజత్వం కంటే బిల్డప్ ఎక్కువ కనిపిస్తుంది. ఇందులో అదేమీ లేకుండా చాలా మామూలుగా నటించాడు. పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు. ఐతే డైలాగ్ డెలివరీలో - హావభావాలు పలికించడంలో మొదట్నుంచి ఉన్న కొన్ని బలహీనతల వల్ల శ్రీనివాస్ అక్కడక్కడా కొంచెం ఇబ్బంది పడినా... ఈసారి డిస్టింక్షన్లో పాసయ్యాడు. ఈ సినిమాలో బెల్లంకొండలోని నటుడిని వంద శాతం బయటకు తీసిన ఒక సన్నివేశం అద్భుతంగా పడింది. అమ్మాయిలను చంపుతున్న సైకో కిల్లర్ ను పట్టుకునే పోలీసు పాత్రలో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ మేనకోడలిని దిగ్భ్రాంతికర రీతిలో చూసినపుడు పలికించిన హావభావాలు హైలెట్.
వీర, రైడ్ వంటి సాధారణ సినిమాలు అందించిన దర్శకుడు రమేష్ వర్మను... ఫ్లాపుల్లో ఉన్న బెల్లంకొండ ఎందుకునమ్ముకున్నాడబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు గాని ఈ సినిమా చూశాక... అతన్ని అభినందిస్తున్నారు. బెల్లంకొండ నటన, కథనం, బీజీఎం అదిరిపోయాయని బ్రహ్మాండమైన టాక్ నడుస్తోంది.

ఈ సినిమాకు యునినామిస్ గా మంచి టాక్ నడుస్తోంది. వేరే సినిమాలు కూడా పెద్దగా ఏం లేకపోవడం వచ్చేది లాంగ్ వీకెండ్ కావడంతో రెండో వీకెండ్ నాటికి ఈ సినిమా డబ్బులతో పాటు రికార్డులు కూడా సంపాదిస్తుంది అంటున్నారు.