టాప్ హీరోయిన్ ఒంటరిగా ఫ్లాట్లో ఆ పనిచేసింది

August 07, 2020

పేదవాడి పొట్టకొట్టిన లాక్ డౌన్ నిత్యం తీరిక లేని సెలబ్రిటీలకు మాత్రం మంచి అవకాశాలను, విశ్రాంతిని ఇచ్చింది. కొందరు దీనిని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు.

చాలామంది కొత్తకొత్త అలవాట్లు నేర్చుకున్నాను. తమను తాము తెలుసుకున్నారు. అయితే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అనేక పనులు చేశారట.

యూట్యూబ్ ఛానెల్ ను మరింత అభివృద్ధి చేసుకోవడం, వర్కవుట్స్ కు ఎక్కువ సమయం కేటాయించడం చేసేదట రకుల్ ప్రీత్.

అంతేనా... అయినా చాలా సమయం ఉందని ఆన్లైన్ ఎంబీయే కోర్సులో జాయిన్ అయ్యి తరగతులకు హాజరైందట. 

లాక్ -డౌన్ వల్ల 3 నెలలు ముంబై ఫ్లాట్లోనే ఉండిపోయానని, అన్ లాక్ లో తల్లిదండ్రులను చూడటానికి ఢిల్లీ వచ్చానని రకుల్ తెలిపింది. అయితే ఆ సమయంలో పూర్తి పీపీఈ కిట్ తో ఫ్లైట్ ఎక్కిన రకుల్ ప్రీత్ ఫొటోలు వైరల్ అయ్యాయి. 

ఆ మధ్యన రకుల్ మందుల షాపుకు వెళ్లి ఏవో కొంటే వైన్ తెచ్చకుంటోందని కొందరు వైరల్ చేశారు. దానిని ఫన్నీగా ఖండించింది రకుల్. 

ఈ మధ్యన యోగా క్లాసులు కూడా చెబుతోందట రకుల్ ప్రీత్. తాజగా ఉత్తరాసన పోజ్ గురించి వివరిస్తూ నెటిజన్లకు ఒక యోగ క్లాస్ చెప్పింది. రకుల్.