50 ఏళ్ల వ్య‌క్తి ప్రేమ‌లో ర‌కుల్ ప్రీత్

May 25, 2020

ర‌కుల్ ప్రీత్ ప్రేమ‌లో ప‌డిందా.. అది కూడా 50 ఏళ్ల వ‌య‌సు వాడితోనా అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇది రియ‌ల్ విష‌యం కాదు. రీల్ ముచ్చ‌ట‌. బాలీవుడ్లో ఇంత‌కుముందు రెండు సినిమాల్లో న‌టించి చేదు అనుభ‌వాలు మిగుల్చుకున్న ర‌కుల్ ప్రీత్.. ముచ్చ‌ట‌గా మూడో సినిమాతో రాబోతోంది. అదే.. ‘దే దే ప్యార్‌దే’. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ర‌కుల్‌తో పాటు ట‌బు హీరోయిన్లుగా న‌టించారు. ఐతే అజ‌య్ ప‌క్క‌న రెగ్యుల‌ర్ హీరోయిన్ లాగా క‌నిపించ‌డం లేదు ర‌కుల్. ఇందులో అజ‌య్ త‌న నిజ జీవిత వ‌య‌సు ఉన్న వ్య‌క్తిగానే క‌నిపించ‌బోతున్నాడు. ట‌బుతో అత‌డికి పెళ్ల‌యి విడిపోయి ఉంటాడు. ఈ మిడిలేజ్డ్ ప‌ర్స‌న్‌తో 24 ఏళ్ల ర‌కుల్ ప్రీత్‌కు అనుకోకుండా ప‌రిచయం జ‌రుగుతుంది. త‌ర్వాత వీళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు.
కానీ అజ‌య్ మాజీ భార్య తిరిగి అత‌డి జీవితంలోకి వ‌స్తుంది. అజ‌య్ ఫ్యామిలీ మొత్తం ర‌కుల్‌తో అత‌డి రిలేషన్ షిప్ విష‌యంలో తీవ్ర ఆగ్ర‌హంతో ఉంటుంది. ఈ స్థితిలో హీరో ఎలాంటి అవ‌స్థ‌లు ప‌డ్డాడు అన్న‌ది ఈ సినిమా క‌థ‌. మూడు నిమిషాల‌కు పైగా సాగిన ట్రైల‌ర్లోనే కావాల్సినంత వినోదం ఉంది. ఇక సినిమాలో దీనికి మించిన ఎంట‌ర్టైన్మెంట్ ఆశించ‌వ‌చ్చు. నీకు నా వ‌య‌సు ఉన్న పిల్ల‌లు ఉన్నార‌న్న సంగ‌తి నాకెందుకు ముందే చెప్ప‌లేదు అంటూ అజ‌య్‌ని ర‌కుల్ ప్ర‌శ్నించే డైలాగ్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్లో త‌న కెరీర్‌కు చాలా ముఖ్య‌మైన సినిమా కావ‌డంతో ర‌కుల్ గ్లామ‌ర్ విష‌యంలో హ‌ద్దులేమీ పెట్టుకోలేదు. ఇప్ప‌టిదాకా ఏ సినిమాలో లేనంత సెక్సీగా క‌నిపించింది. ట్రైల‌ర్లోనే ఆమె క్లీవేజ్ షో హైలైట్ అయింది. అకివ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.