కిరాణా కొట్టుకు వచ్చిన టాప్ హీరోయిన్

August 07, 2020

సడెన్ గా రోడ్డు మీద సెలబ్రిటీ... అది కూడా హీరోయిన్ కనిపిస్తే ఎలా ఉంటుంది? లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లలోనే ఉండటంతో సెలబ్రిటీలు స్వేచ్ఛగా తమ అవసరాల కోసం కొట్ల వద్దకు వచ్చి కొనుక్కునిపోతున్నారు. మాస్కు అడ్డం ఉండటం వల్ల చాలా మంది త్వరగా గుర్తుపట్టడం లేదు. ఈ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ ని గమనించారా? భౌతిక దూరం నిబంధనల వల్ల ఎవరిని దూరంగా ఉంచినా ఇపుడు ఏమీ అనరు. జనం కూడా వినే పరిస్థితి. అందుకే సెలబ్రిటీలకు కొంచెం స్వేచ్ఛ వచ్చింది. ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్... తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ దుకాణానికి వచ్చి అవసరమైన కొన్ని వస్తువులు కొనుక్కుని వెళ్లింది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preeth singh)ని తక్కువ మంది మాత్రమే గుర్తుపట్టినట్టుంది. 

కిరాణా కొట్టుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్