వర్మను భయపెట్టిందేంటి?

February 17, 2020
CTYPE html>
సంచలనాల వర్మ తాజాగా మరో భారీ సంచలనానికి తెర తీశారా? అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతున్న వేళ.. తాజా ట్వీట్ తో పర్మినెంట్ గా పుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పటికే ఆయన తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్ల చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ.. హాట్ టాపిక్ గా మారిన ఆయన.. తన తర్వాతి ప్రాజెక్టు మెగా ఫ్యామిలీ పేరుతో తీయనున్నట్లు చెప్పి..ఈ రోజు ఉదయం దానికి సంబంధించిన డిటైల్స్ ప్రకటిస్తానని చెప్పారు.
దీంతో.. మెగా అభిమానులతో పాటు.. సినిమా ఇండస్ట్రీలోనూ ఇదో సంచలనంగా మారింది.  పూర్తి వివరాలు ప్రకటిస్తానన్న వర్మ.. అందుకు భిన్నంగా ఈ ఉదయం ఆయన భిన్నమైన ట్వీట్ చేశారు. తాను మెగాఫ్యామిలీ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు వెల్లడించారు. తాను ఆ సినిమాను తీయాలనుకోవటం లేదని.. అందుకు కారణం మెగా ఫ్యామిలీ మూవీలో ప్రధాన ప్రాతధారికి 39 మంది పిల్లలు ఉంటారని చెప్పారు.
చాలా ఎక్కువమంది పిల్లలు ఉండటం.. పిల్లల సినిమాల్ని తీయటంలో తనకు అనుభవం లేదన్న ఆయన.. అందుకే మెగా ఫ్యామిలీ ప్రాజెక్టును తెర కెక్కించాలనుకోవటం లేదన్నారు వర్మ. అంతాబాగుంది కానీ.. వివరాలు ప్రకటించే వేళలో ఇలాంటివి గుర్తుకు రావటం ఏమిటి? డిటైల్స్ ప్రకటించే వేళలో.. వర్మకు ఆ ఆలోచన రాకుండా ఉంటుందా? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. 
 ఏదో గట్టి వార్నింగ్ వల్లే... వర్మ వెనక్కు తగ్గి ఉంటారని అనుకుంటున్నారు. అయితే... అది ఏ సైడ్ నుంచి వచ్చిందనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కాపు వర్గం... వైకాపాపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకునే ప్రమాదం ఉందని... వర్మను ఎవరైనా ఆపేశారా?