ట్విట్టరులో గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీ హల్ చల్

February 23, 2020

మహిళల కోసం పోరాడింది ఎవరు అంటే... కందుకూరి వీరేశలింగం, రాజారామమోహన్ రాయ్, గాంధీ, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ అని అనుకుంటున్నారేమో... అదంతా పాత కథ. మహిళల కోసం పోరాడుతున్న వారి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న అభినవ గాంధీ... గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీ అంట. ఈయనెవరు అనుకుంటున్నారేమో. మన సంచలన విచిత్ర పరమ చెత్త అద్భుత మహా దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయనకు ఈ పేరు ఎపుడు పెట్టారబ్బా అనుకోవద్దు. ఆయన ఇంకొకరు పెడితే ఒప్పుకోరు. తనకు తానే పెట్టుకుంటారు. 

ఆయన తాజా పేరు గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీ అట. స్వయంగా తన ట్విట్టరులో తానే రాసుకున్నారు ఆర్జీవీ. ఒక అభిమాని తన ఫొటోతో గాంధీని మిక్స్ చేసి చేసిన ఒక పిక్ ను వర్మ తెగ ఇష్టపడ్డాడు. నాలో గాంధీ ఉన్నాడని నాకే తెలియదు. అయితే... ఈరోజు నా జయంతి అన్నమాట. హ్యాపీ మై జయంతి అంటూ తనకు తాను విసెష్ చెప్పుకున్నాడు. ఒరే జయంతి అంటే చచ్చినోళ్లకు మాత్రమే చేసేది, జన్మదినం అంటే బతికున్నోళ్లు చేసుకునేది అని వర్మకు క్లాస్ పీకడానికి ట్రై చేయకండి. ఎందుకంటే వర్మకు ఆ విషయం కూడా తెలుసు. కానీ ఈ పదం ఎందుకు వాడకూడదో చూద్దాం అని అలా రాసుకున్నాడు అంతే. 

ఇలా గాంధీ జయంతిని కూడా రాంగ్ రూట్లో వాడుకుని పబ్లిసిటీకి ట్రై చేసే విచిత్రమైన లక్షణం మన రాముకి మాత్రమే ఉంది. ఇక గట్టిగా అడిగితే... మన గాంధీని మనం వాడుకోకూడదా, నా తండ్రిని (జాతిపిత కదా) నేను వాడుకుంటే తప్పేమని అడిగినా అడుగుతాడు. కాబట్టి కాస్త అన్నీ మూసుకుని మనం సైలెంటుగా వర్మ చెప్పింది విని పక్కకు పోవడమే బెటర్.