కాస్టింగ్ కౌచ్ శాశ్వతం... పోరాటాలు అశాశ్వతం - RGV

August 08, 2020

రాంగోపాల్ వర్మ ఏ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆలోచించడు. దీనికి కారణం... సామాజిక విషయాలపై తనకంటూ కచ్చితమైన నిశ్చిత అభిప్రాయాలున్నాయి. వాటిని ఎపుడూ ఎవరి కోసమూ అతను మార్చుకోడు. తనకు నచ్చినట్లు బతకడానికి కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడు. 

అతను దేవుడికి, సమాజానికి, పోలీసులకు... చివరకు మహిళాసంఘాలకు కూడా భయపడడు. వర్మ జోలికి పోవాలంటే వాళ్లే భయపడాలి. అలా అని పిచ్చిగా ప్రవర్తించడు. తనకు నచ్చిన సిద్ధాంతాలకు అనుగుణంగా మాత్రమే వాదిస్తాడు. 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి వర్మ అభిప్రాయం అడిగితే ... అది శాశ్వతం అని వ్యాఖ్యానించాడు. ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకు కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అన్నాడు. క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి అనే అమ్మాయి పోరాటం చేసింది. ఏమైంది... అది ఒక దశ అంతే. అనేక ఫేజ్ లు అలా వస్తూ పోతూ ఉంటాయి. 

మనిషి బేసిక్ లక్షణం పోదు. మగాడి నుంచి మహిళకు డబ్బు కావాలి. మహిళ నుంచి మగాడికి సెక్స్ కావాలి. కొందరు వృత్తిలో భాగం అనుకుంటారు. ఇంకొందరు తప్పదనుకుంటారు, మరి కొందరు సీరియస్ గా తీసుకుంటారు. ఎన్ని వచ్చినా ఈ ఎక్స్ ప్లాయిటేషన్ అనేది పోదు అన్నాడు వర్మ.