జగన్ సర్కారుకు రామ్ మాధవ్ వార్నింగ్

May 26, 2020

జగన్ బీజేపీతో ప్రయాణం చేయాలని బలంగా కోరుకుంటున్నా... బీజేపీ మాత్రం జగన్ మీద కారాలు మిరియాలు నూరుతోంది. దీనికి కారణం కూడా జగనే కావడం విశేషం. అద్భుతమైన పాలన ఆశించి జగన్ కి అధికారం కట్టబెడితే... విధ్వంసానికి తెరలేపాడని బీజేపీ మండిపడుతోంది. ఇంతవరకు పాలనా నిర్మాణం మొదలుకాకపోగా.. అన్ని రకాల విధ్వంసం విజయవంతగా సాగుతోందని బీజేపీ నేత రాంమాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీని ముందుకు తీసుకెళ్తారనే ఆకాంక్షతోనే ప్రజలు వైసీపీకి పట్టంకట్టారు. కానీ మీరు నాశనం చేస్తున్నారు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ముందుకు పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తే... చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు రాంమాధవ్. కేంద్ర ప్రభుత్వం మాదిరే రాష్ట్రంలోనూ సమర్థ పాలన సాగాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులు కొనసాగితే... ప్రతిపక్ష పాత్రను కూడా పోషించేందుకు సిద్ధమన్నారు. త్వరలో ప్రభుత్వంపై పోరాటాలు కూడా మొదలుపెడతామని హెచ్చరించారు.
కొసమెరుపు ఏంటంటే... బీజేపీ నేతలు వరుసగా వైసీపీ మీద పదే పదే విమర్శలు చేస్తూ, గట్టిగా తిడుతున్నా... రోజుకు పది సార్లు చంద్రబాబు మీద విరుచుకుపడే విజయసాయిరెడ్డి కిమ్మనడం లేదు. ఎంత సేపు ఈ ప్రభుత్వ తప్పులు పాత ప్రభుత్వంపై నెడుతూనే ఉన్నారు. క్రిస్టియానిజం మాత్రం రాష్ట్రంలో ఊపందుకుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.