జగన్ ది వ్యూహాత్మక కుట్ర - రామ్మోహన్

August 15, 2020

ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. తాను జైలు జీవితం గడిపినందున ఆ విమర్శలు చేసిన  వారందరినీ జైలుకు పంపే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని రామ్మోహన్ ఆరోపించారు. టీడీపీ నేతలపై సీఎం జగన్ కుట్రలు చేసి, కేసుల్లో ఇరికిస్తున్నారని  ఆరోపించారు. అచ్చెన్నాయుడును ఎలాగైనా జైల్లో పంపాలన్న దురుద్దేశంతోనే  తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. 

ఒక వ్యక్తికి సర్జరీ జరిగాక ... ప్రభుత్వం వల్ల అతనికి రెండో సర్జరీ చేయాల్సి రావడం మానవ హక్కుల ఉల్లంఘన. దీనిపై పోరాడుతాం. పైగా రెండో సర్జరీ జరిగాక డిశ్చార్జి అనంతరం ఏ పేషెంటు అయినా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. వీల్ ఛైర్, అంబులెన్స్, స్ట్రెచర్ సాయంతో ఒక వ్యక్తిని జైలుకు పంపారు అంటే అది కచ్చితంగా కుట్రే. దీనిపై కోర్టులో పోరాడతాం అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఒక వ్యక్తి స్ట్రెచర్ మీద జైలుకు తరలించడం ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇంత హడావుడిగా జైలుకు తీసుకెళ్లడం వెనుక ఉద్దేశం బెయిలు వస్తుందని తెలియడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ కి ప్రజాస్వామ్యంపై గాని, మానవ హక్కులపై గాని ఏ మాత్రం గౌరవం లేదన్నారు. జగన్ అరాచకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని స్పష్టం చేశారు.