సాయిరెడ్డితో చెడుగుడు ఆడిన రామ్మోహన్ నాయుడు

August 07, 2020

మనం ఎంత తోపులు అయినా

మన చేతిలో ఎంత అధికారం ఉన్నా

కొన్ని సార్లు మాటలు ఆచితూచి మాట్లాడాలి

లేకపోతే రిజల్టు ఎలా ఉంటుందో... తాజాగా యువ ఎంపీ రామ్మోహన్ నాయుడి చేతిలో తిట్లు తిన్న సాయిరెడ్డిని చూస్తే తెలుస్తుంది. ట్విట్టరు ఉంది కదాని ఒక అసిస్టెంటును పెట్టుకుని నోటికొచ్చిందంతా వాగి... పోస్టు చేయి అంటే సరిపోతుందా. అటువైపు వారు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా. కొందరు భయపడితే భయపడొచ్చు. కానీ అందరూ భయపడరు కదా. కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోవడం కష్టం.

ఉత్తరాంధ్ర బిడ్డ, ఎర్రన్నాయుడి వారసుడు అయిన రామ్మోహన్ నాయుడు సాయిరెడ్డికి పేలుపోయే కౌంటర్ ఇచ్చారు. జగన్ అసలు శత్రువు, పక్కలో బల్లెం సాయిరెడ్డే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి చక్రవర్తుల అసమర్థ పాలనను తీవ్రంగా ఎండగట్టారు.  

వివాదం ఏంటి?

తెలుగుదేశం పార్టీ పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది ఆ పార్టీ అంతర్గత విషయం. అదేదో చంద్రబాబు డైరీ రాసేవాడిలా నిత్యం ఆయన చుట్టు తిరిగే సాయిరెడ్డి ఏదో ఒక మాట అనేస్తుంటాడు. ఆయన కొడుకు లోకేష్ ను ఇందులో ఇన్వాల్వ్ చేస్తాడు. తాజాగా తెలుగుదేశం పార్టీలో పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది బయట వాళ్లు చేస్తున్న ప్రచారమే గాని అధికారికంగా ఏమీ ఎక్కడా రాలేదు. 

ప్రస్తుతం కళా వెంకట్రావు ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు. ఆయనను తొలగించి ఎవర్ని పెట్టాలనే చర్చ గురించి తన ట్విట్టరులో పోస్టు పెట్టారు సాయిరెడ్డి. బాబు కొడుకు లోకేష్ పై విమర్శలు చేస్తూ అతను పనికిరాడని..అందుకే ఏపీ అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడిని చేద్దాం అనుకుంటున్నాడని ... ఆ పదవి ఓ ముళ్లకిరీటం అని, దానికి రామ్మోహన్ ను చంద్రబాబు బలి చేస్తున్నాడన్నది సాయిరెడ్డి కట్టుకథ. 

ఈ కట్టు కథ ప్రధాన ఉద్దేశం ... పార్టీలో అంతర్గత విభేదాలకు నిప్పు రాజేసే ప్రయత్నం మినహా మరేమీ కాదు. ఇక సాయిరెడ్డి ఇంకో యాంగిల్ ఏంటంటే... విశాఖను ఉద్దరిద్దామని జగన్ ప్రయత్నించారట. రాజధాని తరలించడం ద్వారా విశాఖపట్నం సుడి తిరుగుతుందట. దానికి అడ్డుపడినందుకు తెలుగుదేశానికి డ్యామేజ్ జరిగిందట... డ్యామేజ్ ను ఆపడానికి బాబు రామ్మోహన్ కి ఆ పదవి ఇస్తున్నారట. ఇది సాయిరెడ్డి పెట్టిన ట్వీటు సారాంశం.

ఇక్కడ సాయిరెడ్డికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి

1. వైజాగ్ ప్రజలు బాబు వైపు ఉన్నారో, జగన్ వైపున్నారో సాయిరెడ్డి కి తెలియదా?

2. మూడు రాజధానుల ప్రకటన అనంతరం జగన్ వైజాగ్ టూరు పెడితే అది అట్టర్ ప్లాప్ అయింది నిజం కాదా ?

3. వైజాగ్ లోనే అత్యధికులు మాకు రాజధాని వద్దని వ్యతిరేకించింది నిజం కాదా?

4. రాజధాని వస్తే మా ప్రశాంతతకు ముప్పు అని ప్రజలు తిరస్కరిస్తున్నది నిజం కాదా?

5. వైజాగ్ ను క్యాపిటల్ అనేసి దానిని అంతర్జాతీయ నగరంలో మార్చడంలో విఫలమవుతున్నది నిజం కాదా?

6. సాయిరెడ్డి చెప్పినట్లు అక్కడ పెడతాం అంటే ఉత్తరాంధ్ర మిమ్మల్ని ప్రేమిస్తే... రాజధాని తరలించినందుకు మధ్య ఆంధ్ర, దక్షిణాంధ్ర జిల్లాలు మిమ్మల్ని ఏకిపారేస్తున్న విషయం నిజం కాదా?

ఇవన్నీ సాయిరెడ్డి కి తెలుసు. కానీ ఆయన కళ్లుండీ చూడలేని కబోధి. తాను తన పార్టీ వారు చేసే తప్పులు కనిపించని వ్యాధి ఏంటో సాయిరెడ్డిని వేధిస్తోంది. ఆ వ్యాధికి గట్టిగా మందు వేశాడు రామ్మోహన్ నాయుడు. 

యువ కెరటం రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఎంత పనిచేసిందంటే... ఏపీ మొత్తం సాయిరెడ్డికి కరెక్టైన మొగుడు దొరికాడు అని మాట్లాడుకునేంతగా పేలింది. 60 ఏళ్ల ఈ పెద్దాయనకు ... రక్తం సలసల మరిగే యువత జోలికి పోతే ఆ దెబ్బ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో బాగా రుచి చూపించారు రామ్మోహన్ నాయుడు. ఆయన వేసిన కౌంటర్ కింద చూడొచ్చు.