స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో పిటిషన్

August 13, 2020

కోర్టుల నుంచి పాలిస్తారా అంటూ మొన్న ఏపీ స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అందరూ ఆశ్చర్యపోయారు.

రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలుంటాయి. అవి చట్టసభలు, న్యాయవ్యవస్థ ,  పరిపాలన వ్యవస్థ. స్పీకర్ చట్టసభల వ్యవస్థలోకి వస్తారు. సీఎం పాలన వ్యవస్థలోకి వస్తారు.

కోర్టులు న్యాయవ్యవస్థలోకి వస్తాయి. ఈ మూడింటిలో ఎవరిపై ఎవరికీ అధికారం ఉండదు.

అయితే, రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత కోర్టులది కాబట్టి, ఇతర వ్యవస్థలు రాజ్యాంగాన్ని అతిక్రమించినపుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి.

అయితే, తమ్మినేని సీతారాం ఈ జోక్యంపై అభ్యంతరం చెప్పారు. అంటే తమ్మినేని తన పరిధి దాటి మాట్లాడారు.

ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ, విశ్లేషకుడు నాగేశ్వర్ బల్లగుద్ది చెప్పారు.

తాజాగా బీజేవైఎం నేత రమేష్ నాయుడు తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషను వేశారు.

ఏపీ స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆయన రిట్ పిటిషనులో పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యలు సరికాదు అంటూ పిల్ లో వివరించారు.

కోర్టులో పిటిషను వేసిన రమేష్ నాయుడు తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఇలా స్పందించారు.

‘‘న్యాయస్థానం మీద రాజ్యాంగం పదవి అయ్యిన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి , వ్యవస్ధల మీద ప్రజలకు అపనమ్మకం కలిగేలా వ్యాఖ్యలు చేయడం బాదించాయి ! వ్యవస్ధలు మీద విశ్వాసం, గౌరవం,పెరిగేలా చేయడం! వాటి విలువలు రాబోవు తరాలుకు అందజేయడం ఈ తరం నాయకులుగా మన బాధ్యత!  

న్యాయ వ్వవస్థ మిద అపనమ్మకం కలిగే విధంగా ,ప్రజలలో, అనుమానాలు కలిగే విధంగా మాట్లాడిన సభాపతి వ్యాఖ్యలు నన్ను బాధించాయి!

మా పార్టి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ  గారి అనుమతితో దినిమిద హైకోర్టుకు నేను పిర్యాదు చేసాను!’’  

తమ్మినేని కోర్టులను ఏమన్నారో కింద చదవండి

కోర్టులపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు 

ఏపీ స్పీకర్ తమ్మినేని రాజ్యాంగాన్ని అతిక్రమించారా?