విశాఖ అగ్ని ప్రమాదం వెనుక భారీ కుట్ర

August 08, 2020

ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరుస ప్రమాదాలు జరుగుతుంటే డిఫెన్సులో పడిన వైసీపీని రక్షించడానికి వైసీపీ నేతలు తమదైన శైలిలో చాణక్యం ప్రదర్శిస్తున్నారు. నిర్లక్ష్యం అనే విషయమే చర్చకు రాకుండా ఉండేందుకు కొత్త సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రమాదంపై చర్చను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ మాట్లాడుతూ విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత వరుసగా ప్రమాదాలు జరగడంపై తనకు వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యక్తిగత అనుమానాలు ఏంటో మరి ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

 విశాఖలో వరుస ప్రమాదంలో విశాఖపట్నం ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. దీంతో దాని నుంచి పార్టీని తప్పించేందుకు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు వారిని నవ్వుల పాలు చేస్తున్నాయి. వైసీపీ నేతల ఐడియా బ్యాక్ ఫైర్ అయ్యి వైసీపీ పార్టీని వారి వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ చేసే పరిస్థితి వచ్చింది.

 

అమర్ నాథ్ రెడ్డి ఏమన్నారు?

టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతల తీరు చూస్తుంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టి రాజధాని రాకుండా ఆలోచన చేస్తున్నారనే భయం కలుగుతోందన్నారు

ప్రభుత్వం ఎవరిది ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది 

అమర్ నాథ్  రెడ్డి ఎవరు?

వైసీపీ ఎమ్మెల్యే

ప్రమాదం జరిగింది ఎక్కడ?

రాంకీ ఫార్మా సిటీలో.

రాంకీ ఫార్మా సిటీ ఎవరిది?

అయోధ్య రామిరెడ్డిది

అయోధ్య రామిరెడ్డి ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు

కుట్ర విచారించాల్సిందెవరు?

జగన్ సర్కారు.

మరి మధ్యలో చంద్రబాబు ఎలా వచ్చాడు? రాంకీ ఫార్మా సిటీలో ఆయనకు వాటాలున్నాయా? పోనీ చంద్రబాబు కంపెనీలు ఆ సెజ్ లో ఉన్నాయా. ఇపుడు మీకు ఇది కుట్ర అనిపిస్తుందా? నిర్లక్ష్యం అనిపిస్తుందా? వైఫల్యం అనిపిస్తుందా? 

కథ ముగిసింది !