రామోజీ మనవవరాలి పెళ్లి - వరుడు గురించి తెలుసా

June 02, 2020

ఎప్పుడు కుదిరిందో కానీ రామోజీ మ‌న‌మ‌రాలు పెళ్లి వివ‌రాలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. ఎంగేజ్ మెంట్ సైతం చాలా ప‌రిమితంగా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలిసింది. మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే పెళ్లి జ‌రిగింది. మీడియా మొఘ‌ల్ ఇంట పెళ్లి వేడుక అంటే.. అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌కుండా ఉంటుందా?  ప్ర‌ముఖులు రాకుండా ఉంటారా?  రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగే ఏ ప్ర‌ముఖుడి ఇంట్లో జ‌రిగే పెళ్లికి రానంత భిన్న‌రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు రామోజీ ఫిలింసిటీకి పోటెత్తారు. పెళ్లి ఎంత వేడుక‌గా.. వైభ‌వంగా జరిగింద‌న్న విష‌యం మీద మీడియాలో వార్త‌లు వ‌చ్చేశాయి. కాబ‌ట్టి.. వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదు. పెళ్లి కుమార్తె ఎవ‌ర‌న్న విష‌యం మీద క్లారిటీ ఉంది. రామోజీరావు చిన్నకొడుకు సుమ‌న్ పెద్ద కుమార్తె సుహానా. ఆ మ‌ధ్య‌న కేన్స‌ర్ కార‌ణంగా సుమన్ మరణించడంతో మ‌న‌మ‌రాలి పెళ్లికి క‌న్య‌దాత‌గా వ్య‌వ‌హ‌రించారు రామోజీ దంప‌తులు వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంది.

అయితే పెళ్లి కొడుకు ఎవ‌రు? అత‌గాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?  రామోజీ ఇంటి అల్లుడు అయ్యే అదృష్టం అత‌నికి ఎలా ద‌క్కింది? అన్న‌ది ప్ర‌శ్న‌. పెద్ద‌ల కుదిర్చిన ఈ వివాహానికి సంబంధించి పెళ్లి కొడుకు వారి ఇంటి వివ‌రాలు మీడియాలో పెద్ద‌గా రాలేదు. ఆరా తీస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 

రామోజీ మ‌న‌మ‌రాలి భ‌ర్త పేరు రాయ‌ల విన‌య్. ఎవ‌రీ కుర్రాడు అంటే న‌వ‌యుగ ఇండ‌స్ట్రీస్ ఉంది క‌దా?  దాని య‌జ‌మాని  సీవీ రావు మ‌న‌మ‌డు. అబ్బాయి ఇంటిపేరును చూస్తే.. సీవీ రావుగారి కూతురు కొడుకుగా అనిపించ‌క మాన‌దు. 1986 ప్రాంతంలో ఒక సాదాసీదాగా కంపెనీగా స్టార్ట్ అయిన న‌వ‌యుగ‌ ఈ రోజు పెద్ద కంపెనీగా అవ‌త‌రించింది. వేలాది కోట్ల రూపాయిలు వ్యాపార ప్ర‌పంచం న‌వ‌యుగ సొంత‌మ‌న్న మాట మార్కెట్ వ‌ర్గాలు చెబుతుంటాయి.

ఎందుకో గానీ ఈ పెళ్లి వివరాలు పెద్దగా బయటకు రాలేదు. చివరి నిమిషంలో పెళ్లి గురించి బయటకు తెలిసినా... వరుడి వివరాలు మాత్రం పెద్దగా వార్తలు కూడా ఎక్కడా రాలేదు. అయితే ప్రస్తుతం పోలవరం కడుతున్న ఈ కంపెనీ పూర్వాశ్రమంలో జగన్ కేసు వ్యవహారాల్లో వార్తలోకి వచ్చింది. మరి శత్రువులు శాశ్వతం కాదు.