సంచలనం : రామోజీ-బాబు- కేసీఆర్ కలిసి లంచ్

February 19, 2020

మధ్యాహ్నం రామోజీరావు, చంద్రబాబు మీటింగ్ గురించే అందరికీ తెలిసింది. కానీ రామోజీ అందరికీ ఇంకో సర్ ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి మీటింగ్లో కేసీఆర్ కూడా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. రామోజీ రావు, కేసీఆర్, చంద్రబాబు ముగ్గురు లంచ్ కి కలిసినట్లు తెలుస్తోంది. అంటే ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే నడుస్తోంది. ఒకవైపు బీజేపీకి గతంలో రామోజీరావు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. 2014లో మోడీ ప్రధానిగా పోటీ చేసినా 2008 నుంచి రామోజీ మీడియా నెట్ వర్క్ మోడీని ప్రమోట్ చేస్తూ వస్తోంది. అందుకే మోడీ ప్రధాని  ప్రమాణస్వీకారినికి ఇతర దేశాల అధ్యక్షుల సరసన రామోజీకి ప్రత్యేక ఆసనం వేయించారు మోడీ.

అయితే వీరి మధ్య చంద్రబాబు లేరు. చంద్రబాబు - రామోజీ సంబంధాలు వేరు. రామోజీరావు - మోడీ సంబంధాలు వేరు. రెండు ఒకటి కాదు. అయితే తదనంతర కాలంలో మోడీతో తెలుగుదేశం అధినేతకు చెడింది. కానీ రామోజీరావు మాత్రం బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు. కాకపోతే మోడీ మునుపటి ప్రాధాన్యం రామోజీకి ఇవ్వడం లేదనేది మాత్రం వాస్తవం. దానికి తెలుగుదేశం విడిపోవడం అయితే కారణం కాదు గానీ... ప్రధాని అయ్యాక మోడీ ఆట్యిట్యూడ్ కూడా మారి ఉండొచ్చు. ఇలాంటి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మోడీకి ఎదురు గాలి వీస్తున్నపుడు జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. మోడీ మళ్లీ ప్రధాని అవుతాడు అని చాలామంది అంటున్నా.... సొంత మెజారిటీతో అవుతాడు అని ఎవరూ చెప్పడం లేదు. 

ఇవన్నీ చూస్తుంటే... సొంత మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే... ఆ సందర్భంలో బీజేపీలో మరో వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు - కేసీఆర్ మధ్య రాజీ కుదిర్చి ఇద్దరినీ కలిపి బీజేపీని నిలబెట్టేందుకు రామోజీ  రావు ప్రయత్నం చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. ఎందుకంటే గతంలో కోర్టులో కూడా రామోజీరావు తాను కాంగ్రెస్ శత్రువు అని స్వయంగా చెప్పుకున్నారు. మరి ఈ నేపథ్యంలో మోడీ లేని బీజేపీ వైపు మంత్రాంగానికే రామోజీరావు ప్రయత్నిస్తున్నాడా? అన్నది ఒక అనుమానం

ఇంకొందరు దీనిని కొట్టి పారేస్తున్నారు. ఇంకోసారి మోడీ వస్తే దేశంలో అందరూ అతనికి బానిసల్లా ఉండాల్సిన పరిస్థితులు తెప్పించే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మోడీని దించడమే అజెండాగా కేసీఆర్, చంద్రబాబు కలుస్తారని వారిద్దరి మధ్య రామోజీ మధ్యవర్తిత్వం చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... కాంగ్రెస్ ను ఎపుడైనా దించొచ్చు. ఆ పార్టీ లో అనైక్యతే దానికి కారణం. కానీ ఇంకోసారి బీజేపీ బలపడితే దానిని దించడం అసాధ్యం. ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేనట్టు వ్యవస్థలను చేతిలోకి తీసుకున్నారు నరేంద్ర మోడీ. ఇంకోసారి అతనికి అవకాశం ఇవ్వడం ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదం అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయం తెలియకుండా అనవసరంగా హడావుడి చేస్తున్న కేసీఆర్ కు స్టాలిన్ మీటింగ్ లో వాస్తవం అర్థమయ్యింది. మళ్లీ మనమందరం ఉండాలంటే మీరు కాంగ్రెస్ తో కలవక తప్పదన్న సంకేతాలు ఇవ్వడం, వెనువెంటనే మరుసటి రోజు డీఎంకే వాళ్లు అమరావతి రావడం, ఆ వెంటనే మరుసటి రోజు రామోజీ-చంద్రబాబు-కేసీఆర్ కలవడం కొత్త రాజకీయ ప్రకంపనలు తెలుస్తుంది. 

ఇక జగన్ విషయం పెద్ద పాయింట్ కాదు. ఎందుకంటే వీళ్లే కాంగ్రెస్ తో కలిసినపుడు జగన్ కలవడం పెద్ద వింత కాదు. ఏదిఏమైనా ఈసారి జాతీయ రాజకీయాలు దక్షిణాది చుట్టూ తిరుగుతండటం, ఆశ్చర్యకరమే.