రామోజీకి జగన్ లేఖ

August 05, 2020

దేశ వ్యాప్తంగా ఎటువంటి విపత్తు వచ్చినా కచ్చితంగా స్పందించే వ్యక్తి రామోజీరావు. రామోజీ గ్రూపు సంస్థల ఎండీ అయిన రామోజీ కరోనా విపత్తు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు 20 కోట్ల విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. తెలంగాణకు పది కోట్లు, ఆంధ్రాకు పది కోట్లు ఆయన పంపించారు. కలిసి ఇచ్చే అవకాశం లేకపోవడంతో... ఆన్ లైన్ ద్వారా ఈ సొమ్ము మొత్తాన్ని ఆయా ఖాతాలకు బదిలీ చేశారు. భారీ విరాళం ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. తన స్థాయికి తగినట్టు స్పందించారని అందరూ రామోజీరావును కొనియాడుతున్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సమర్థంగా కృషిచేస్తున్నాయని... ప్రజలు సహకరించాలని కోరారు. దీని బారి నుంచి త్వరగా ప్రజలందరూ బయటపడి ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కాంక్షించారు.

ఇదిలా ఉండగా... ఆయన విరాళానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగిన సమయంలో విరాళం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రామోజీరావుకు లేఖ రాశారు.