కొత్త చ‌రిత్ర‌ను రాసేసిన రామోజీరావు

April 01, 2020

సినిమా, మీడియా రంగంల్లో ద‌శాబ్దపు దూర‌దృష్టితో ఆలోచించే ఘ‌నాపాటి రామోజీరావు. దేశంలో ఉన్న అన్ని మీడియాల్లో రామోజీరావు శిష్యులు ప‌నిచేస్తున్నారంటే అది సాధార‌ణ విష‌యం కాదు. గ‌త పాతికేళ్లుగా ఆయ‌న జ‌ర్న‌లిజం స్కూలు నుంచి 10 వేల మంది జ‌ర్న‌లిస్టులు త‌యార‌య్యారు. వారిలో ఇప్ప‌టికీ ఆయ‌న గ్రూపుల్లో ప‌నిచేస్తున్న వారి సంఖ్య వెయ్యి దాట‌దు. మిగ‌తా వాళ్లు ఇత‌ర మీడియాల్లో స్థిర‌ప‌డ్డారు. అయినా, ఆయ‌న ఎవ‌రి మీద డిపెండ్ కారు. త‌న నెట్ వ‌ర్క్‌ను ఎప్ప‌టిక‌పుడు ఆధునికీక‌ర‌ణ చేసుకుంటారు. ఆ క్ర‌మంలో తాజాగా ఈటీవీ భార‌త్ పేరిట దేశంలోని 29 రాష్ట్రాల‌కు ఆయా ప్రాంతీయ భాష‌ల్లో యాప్ రిలీజ్ చేశారు. ఒక ర‌కంగా ఇది అతిపెద్ద మీడియా యాప్‌. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో మీడియా సంస్థ‌లున్నాయి గాని ఇలా 29 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వ‌హించే, పూర్తి స్థాయి నెట్‌వ‌ర్క్ ఉన్న మీడియా సంస్థ ఈటీవీ భార‌త్ మాత్ర‌మే. అది కూడా ప్రాంతీయ భాష‌లో విడుద‌ల చేయ‌డంతో రామోజీరావు కొత్త చ‌రిత్ర లిఖించిన‌ట్లయ్యింది.
అయితే, ఈక్ర‌మంలో ఆయ‌న తీసుకున్న జాగ్ర‌త్త‌లు ఎవ‌రికీ అంచ‌నాల‌కు అంద‌వు. 29 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో ప్ర‌ముఖుడు అయిన ముఖ్య‌మంత్రి, లేదా గ‌వ‌ర్న‌రు చేత యాప్‌ను రిలీజ్ చేయించ‌డం ద్వారా సింగిల్ డేలో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రికీ త‌న యాప్‌ను ప‌రిచ‌యం చేశారు రామోజీరావు. ఒక‌ట్రెండు రాష్ట్రాల్లో స్థానిక ప్ర‌ముఖ క్రీడాకారులు ఓపెన్ చేశారు. ఈ నెట్ వ‌ర్క్ ఎంత పెద్ద‌ది అంటే... దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్ర‌తినిధులు ఉన్న ఏకైక మీడియా సంస్థ‌గా రామోజీరావు ఒక్క‌రోజులో వెలిగిపోయారు. ఈ ప‌నిచేయ‌డానికి కేవలం డ‌బ్బు స‌రిపోదు. అసాధార‌ణ‌మైన ప్లానింగ్‌, స్వీయ అనుభ‌వం, ప్రేమ‌తో ప‌నిచేసే ఉద్యోగులు కావాలి...వీటితో పాటు డ‌బ్బు కావాలి. రిల‌యన్స్ వంటి వారు కూడా ఈ ప‌నిచేయ‌లేరు. ఎందుకంటే వారితో డ‌బ్బుంది. కానీ మిగ‌తావి లేవు. కానీ రామోజీరావు వ‌ద్ద అన్నీ ఉన్నాయి. అందుకే ఈ ఫీట్ సాధ్య‌మైంది. బ‌హుశా రామోజీరావు చేసే చివ‌రి ప్రాజెక్టు ఇదే కావ‌చ్చు. ఎందుకంటే ఆయ‌న వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. మ‌రో ప‌దేళ్లు ఆయ‌న జీవించినా... ప్ర‌స్తుతం ఉన్న వాటిని అలా కాపాడుకోవ‌డానికి ఆయ‌న స‌మ‌యం స‌రిపోతుంది. మ‌రో ప‌దేళ్లు అంటే అదేమీ చిన్న స‌మ‌యం కాదు. ముఖ్యంగా ఆయ‌న‌కు. ఏది ఏమ‌యినా... మీడియార‌లో మ‌రెవ‌రూ చేయ‌లేని ఫీట్ చేసి చ‌రిత్ర సృష్టించారు మీడియా మొఘ‌ల్‌.

RELATED ARTICLES

  • No related artciles found