రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం- కారు సీజ్

August 05, 2020

శివగామి రమ్యకృష్ణ కారును పోలీసుల సీజ్ చేశారు. వంద మద్యం బాటిల్స్ తో రమ్యకృష్ణ కారు డ్రైవరు మద్యాన్ని తరలిస్తుండగా... పోలీసులు పట్టుకుని కారును సీజ్ చేసి, డ్రైవరును అరెస్టు చేశారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకి వీటిని తరలిస్తుండగా పోలీసుల సాధారణ చెకింగ్ లో వాహనాన్ని పట్టుకున్నారు. 

రమ్యకృష్ణ పేరు మీదున్న ట‌యోటా ఇన్నోవా క్రిస్టా( TN‌07 Q 0099) కారులో చెన్నై పోలీసులు భారీగా మద్యం ఉన్నట్టు గమనించారు. వెంటనే చెక్ చేయగా... 96 బీర్ బాటిల్స్, 8 ఫుల్ బాటిల్స్ మద్యం బయటపడింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో పోలీసులు ఈ వాహనాన్ని గుర్తించారు. కారు డ్రైవరు ఆందోళన చూసి పోలీసులకు అనుమానం వచ్చి తనికీలు చేయగా ఈ విషయం బయటపడింది.

కొందరు కారులో అపుడు రమ్యకృష్ణ లేదని చెబుతున్నారు. కానీ తమిళనాడుకు చెందిన ఒక న్యూస్ ఏజెన్సీ మాత్రం కారులో ఆమెతో పాటు చెల్లెలు వినయ కృష్ణన్ కూడా ఉందంటున్నారు. అందరినీ అదుపులోకి తీసుకున్నారు.  రమ్యకృష్ణను, ఆమె చెల్లెలిని వెంటనే వదిలేశారు. డ్రైవరుపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే అతన్ని బెయిలు మీద వదిలిపెట్టారు. 

ఈ సంఘటన  గురువారం రాత్రి జరిగింది. కాకపోతే ఆలస్యంగా బయటకు వచ్చింది.