మ‌ళ్లీ కృష్ణ‌వంశీతో ర‌మ్య‌కృష్ణ‌?

February 23, 2020

కృష్ణ‌వంశీ పేరు చెబితే ఒక‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల్లో ఒక‌ర‌క‌మైన పుల‌కింత క‌లిగేది. అంద‌రూ ఒక మూస‌లో కొట్టుకుపోతుంటే అత‌ను మాత్రం గురువు రామ్ గోపాల్ వ‌ర్మ బాట‌లో స‌రికొత్త సినిమాల‌తో తెలుగు సినిమాను ఎన్నో మెట్లు ఎక్కించాడు. అయితే కెరీర్లో తొలి ప‌దేళ్లు సినిమాకు సినిమాకు పోలిక లేకుండా అద్భుతాల్ని ఆవిష్క‌రించిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ఒక మూస‌లో కొట్టుకుపోయాడు.

మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ సినిమాలు తీయ‌లేక రేసులో వెనుక‌బ‌డిపోయాడు. చివ‌ర‌గా న‌క్ష‌త్రం అనే ఆల్ టైం డిజాస్ట‌ర్ వ‌చ్చింది ఆయ‌న్నుంచి. ఆ త‌ర్వాత ఇంకో సినిమా మొద‌లు పెట్ట‌డానికి చాలా కాలం ప‌ట్టేసింది.
కృష్ణ‌వంశీ కొత్త సినిమా ఒక రీమేక్ అన్న‌ది తాజా స‌మాచారం. మ‌ల‌యాళంలో క్లాసిక్ అనిపించుకున్న న‌ట సామ్రాట్‌ను ఆయ‌న రీమేక్ చేస్తున్న‌ట్లు కొన్నాళ్ల కింద‌టే వెల్ల‌డైంంది. నటుడు కూడా అయిన దర్శకుడు మహేష్ మంజ్రేకర్ మ‌రాఠీలో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. లెజెండరీ యాక్టర్ నానా పటేకర్ లీడ్ రోల్ చేశాడు. తెలుగులో తన మిత్రుడు ప్రకాష్ రాజ్ కథానాయకుడిగా కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నాడ‌ట‌. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేసి.. తన టచ్ కూడా జోడించి సినిమా తీయాలని కృష్ణవంశీ భావిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌కాష్‌కు జోడీగా కృష్ణ‌వంశీ భార్య ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వీళ్లిద్ద‌రూ రెండు ద‌శాబ్దాల కింద‌ట చంద్ర‌లేఖ సినిమాకు క‌లిసి ప‌ని చేశారు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డింది కూడా అప్పుడే. ఇన్నేళ్ల త‌ర్వాత భార్య‌ను కృష్ణ‌వంశీ డైరెక్ట్ చేయ‌బోతుండ‌టం విశేష‌మే.