రానా చాలా ఫాస్ట్... వేదిక, తేదీ ఫిక్స్ 

August 08, 2020

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన రానా లాక్ డౌన్ ని అందరికంటే చక్కగా వాడుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి అంతా లాక్ డౌన్లో కానిచ్చేశాడు. ఇప్పటికే బాలీవుడ్ ఫ్యామిలీతో పిల్లను వెతుక్కుని ప్రపంచానికి చెప్పేసిన రానా ఇటీవలే రోకా ఫంక్షన్ కూడా చేసుకున్నారు.

తాజాగా తన పెళ్లి తేదీని, వేదికను ప్రకటించారు. ఆగస్టు 8వ తేదీన వీరి పెళ్లి ముహూర్తం పెట్టారు. హైదరాబాదులోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం, లగ్జరీ హోటల్ అయిన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగనుంది.

పెళ్లికి చాలా పరిమిత సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ఇక వధువు స్వయంగా ఈవెంట్ కంపెనీ ఎండీ కావడంతో ఎంత ఘనంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 

పెళ్లి డెకొరేషన్ రాయల్ సెట్ ప్రతిబింబించేలా వేయనున్నారని సమాచారం. తన పెళ్లికి తానే ఈవెంట్ మేనేజర్ అవుతోంది మిహిక. 

50 మందికి మాత్రమే పెళ్లికి అనుమతి ఇస్తున్న నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించనున్నారు. మరి మెగా ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ ప్రముఖులను పిలుస్తారా లేక కుటుంబ సభ్యులతోనే కానిస్తారా అన్నది ఇంకా తెలియదు. 

పెళ్లి తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.