దగ్గుబాటి హంగామా: పంచెకట్టులో రానా - చీరకట్టులో మిహిక  

August 14, 2020

నటుడు రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ బుధవారం నిశ్చితార్థం చేసుకున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. స్వయంగా వధువు మిహిక బజాజ్ షేర్ చేసిన ఫొటోలు కూడా దానికి సంకేతంగానే ఉన్నాయి. అయితే... రానా తండ్రి మరియు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. రానా - మిహీకా నిశ్చితార్థం, వివాహ తేదీలను ముహూర్తాలను పెట్టుకోవడానికి మాత్రమే రెండు కుటుంబాలు కలిశాయి అని చెబుతున్నారు సురేష్.  

“ఇది నిశ్చితార్థం కాదు. వివాహానికి ముందు, పోస్ట్ ఫంక్షన్ల కోసం ఏమి చేయాలో చర్చించడానికి మా కుటుంబాలు బుధవారం కలిసి కూర్చున్నాయి. నిశ్చితార్థం మరియు వివాహ తేదీలను నిర్ణయించే ముందు వధువు తల్లిదండ్రులను కలవడం తెలుగులలో ఒక ఆచారం. ఒక రకంగా అధికారిక పెళ్లి చూపులు వంటివి. ఈ కొత్త బంధుత్వం కలుపుకోవడం మాకు సంతోషంగా ఉంది ”అని సురేష్ బాబు చెప్పారు.

రానా ఇటీవలే ట్విట్టర్‌లో మిహీకా తన కాబోయే శ్రీమతి అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో  ఎంగేజ్‌మెంట్ మరియు  పెళ్లి గురించి అనేక కథనాలు వచ్చాయి. లాక్ డౌన్ ఫ్రీ టైంని దీనికి బాగా వాడుకున్నారు. ఇదిలా ఉంటే... రణ ఆరణ్య విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మరో దర్శకుడు వేణు ఉడుగుల  దర్వకత్వంలో సామాజిక-రాజకీయ ప్రేమ కథ విరాట పర్వం లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి మరో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.