జనసేన పార్టీ పవన్ ది కాదా?

February 25, 2020
CTYPE html>
జనసేన పార్టీకి జీరో సీట్లు వచ్చినా ఇన్నిఇబ్బందులు ఉండేవి కావు. ఒక సీటు గెలవడం తలనొప్పిగా మారింది. ఈరోజు అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టారు. అమరావతిని చంపేస్తూ విశాఖ, కర్నూలు నగరాలను కూడా రాజధానిగా చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వమని ఉదయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ అమరావతిని ఏకైక రాజధాని ఉంచాలని నిర్ణయించింది కాబట్టి... పార్టీకి అనుగుణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయమని పవన్ లేఖలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను కోరారు. అయితే, పవన్ ఆదేశాలను, పార్టీ ఆదేశాలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక ధిక్కరించారు. 
తాను మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నట్లు రాపాక వరప్రసాద్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అతను పేరుకే జనసేన ఎమ్మెల్యే గాని అతని మనసంతా జగన్ చుట్టూతా తిరుగుతోంది. పవన్ లేఖ రాసిన రోజే... పవన్ లెక్కచేయడం లేదు అని చెప్పడానికే అన్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పక్క సీట్లో కూర్చుని కాసేపు మాట్లాడారు. బిల్లుకు తన మద్దతు కూడా తెలిపారు. అంతటితో ఆగకుండా జనసేన తరఫున తాను బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అసలు పార్టీ ఎవరిది అన్న కొత్త అనుమానం కలిగే పరిస్థితి. ఉన్నది ఒకటే ఎమ్మెల్యే కావడంతో ఫిరాయింపు చట్టమే వర్తించదు. అతను ఏ పార్టీలో కలిసి వద్దనే పరిస్థితి లేదు. పోనీ అలా అని పార్టీ మారడు. దీంతో జనసేనకు గొంతులో వెలక్కాయలా తయారయ్యారు రాపాక. ఏకంగా అసెంబ్లీలో జనసేన తరఫున నా మద్దతు అని చెప్పడం అంటే... పవన్ ఎవరు నాకు చెప్పడానికి నేను చెబుతున్నా జనసేన జగన్ కే మద్దతు పలుకుతోంది అన్నట్లు ప్రపంచానికి చెప్పినట్లయ్యింది. రాపాక ప్రవర్తన పార్టీ మొత్తానికి ఎంబరాసింగ్ గా ఉంది.
ఇదిలా ఉండగా...  సాయిరెడ్డి జీరో కి ఎన్ని జీరోలు కలిపినా ఫలితం జీరోయే అన్న దానిలోె అంతరార్థం కూడా ఇదే. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఉన్న ఒక్కడు మావాడు అయిపోయాడు కాబట్టి... బీజేపీకి జీరో ఎమ్మెల్యేలు, జనసేనకు జీరో ఎమ్మెల్యేలు అనే కోణంలో సాయిరెడ్డి అప్పుడు వ్యంగాస్త్రం వేశారు.