చిరంజీవిని అడ్డంపెట్టుకుని గేమాడుతున్న రాపాక

February 21, 2020
CTYPE html>
ఒకరి బలహీనత మరొకరికి బలం. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది సర్వాసాధరణం. కానీ దీన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఒకవైపు మూడు రాజధానుల విధానాన్ని జనసేన పార్టీ చాలా స్పష్టంగా వ్యతిరేకించింది. కానీ ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే మాత్రం పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా జగన్ ను సమర్థిస్తున్నారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్న రాపాకపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ శ్రేణులు రాపాక విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాపాక స్పందించారు. 
 
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉండగా లేనిది పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటని రాపాక వరప్రసాద్ ప్రశ్నించారు. చిరంజీవి సైతం మూడు రాజధానులను సమర్థించారని అన్నారు. పవన్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదని తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయమని అడుగుతున్నారని వివరించారు. పార్టీ అధినేతగా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది పవనే అని, కానీ తనకు పార్టీ కన్నా ఓట్లేసి గెలిపించిన ప్రజలే ముఖ్యమని అన్నారు. 
రాపాకను నిద్ర నటిస్తున్న వ్యక్తితో పోల్చాలి. నిద్రపోతున్న వ్యక్తిని లేపొచ్చు గాని నిద్ర నటిస్తున్న వ్యక్తిని లేపలేం. ఒక ఇంట్లో రెండు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పార్టీలో రెండు అభిప్రాయాలు ఉండకూడదని రాపాకకు తెలియదు అని అనుకోవాలా? కచ్చితంగా తెలుసు. కానీ రాపాక తెలిసి నటిస్తున్నారు. చిరంజీవి పవన్ కి అన్నయ్యే కావచ్చు. కానీ అతను పార్టీలో చేరనంత వరకు అతను జనసేనకు అనుకూలంగా ఉండాలని ఏం లేదు. అతను ఒక మాజీ పార్టీకి మాజీ అధ్యక్షుడు. పవన్ మరొకపార్టీకి అధ్యక్షుడు... రెండింటికీ సంబంధమే లేదు. 
ఇంకో విషయం పవన్ మూడు రాజధానులు వ్యతిరేకించడం లేదని కూడా రాపాక చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి అన్నీ కలిపి ఒకేచోట పెట్టండి. ప్రజలను ఇబ్బంది పెట్టకండి అన్నది పవన్ వాదన. అమరావతి రైతులకు న్యాయం చేసి రాజధాని మీరు ఎక్కడైనా పెట్టుకోండి. కాకపోతే మూడు ముక్కలు చేయొద్దని పవన్ వాదిస్తున్నాడు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన రాపాక దానిని వక్రీకరిస్తున్నాడు.