చేతులు కాలాక ఆకులు పట్టుకోవటమా రాశీ?

August 03, 2020
CTYPE html>
సినిమా ఇండస్ట్రీలో తారల పరిస్థితి భలే సిత్రంగా కనిపిస్తుంటుంది. అందరికి వారు స్టార్లు. కానీ.. ఆ మెరుపులన్ని వారు నటించిన సినిమాలు చక్కగా ఆడినప్పుడే. హిట్లు.. ఫట్లకు అతీతంగా ఎవరూ ఉండరు. అందుకే.. ఇండస్ట్రీలో ఏమున్నా.. లేకున్నా సక్సెస్ మాత్రం చాలా ముఖ్యం. ప్రజల్లో మంచి ఇమేజ్ ఉండి.. క్రేజ్ ఉన్నా.. వరుస పెట్టి రెండు..మూడు ప్లాపులు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఇటీవల కొందరు హీరోల సంగతి చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది.
సినిమాలు ఎంపిక చేసుకోవటం కూడా ఒక కళే. సినిమా పోయినా.. తన వరకూ తాను సేఫ్ అన్న లెక్కలు వేసుకొని.. అందుకు ఓకే చెప్పే నటీమణులు చాలా తక్కువగా కనిపిస్తారు. నిజానికి.. అదంత ఈజీ విషయం కాదు కూడా. తాజాగా రాశీఖన్నా పరిస్థితి మహా ఇబ్బందికరంగా ఉందన్న మాట వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండుగే సినిమా సక్సెస్ అయినా.. ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావటంతో.. అమ్మడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
చేతిలో ఒక్క తెలుగు సినిమా లేకపోవటం.. ఉన్న రెండు తమిళ సినిమాలే కావటం.. సాయిధరమ్ తేజ్ తో తప్పించి.. మిగిలిన కాంబినేషన్లు వర్క్ వుట్ కావట్లేదన్న మాట ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. తాజా డిజాస్టర్ నేపథ్యంలో.. కథలు.. తన పాత్రల విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలన్న ఆలోచనలో రాశీ ఉందట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకుందట. చేతులు కాలాక ఎన్ని ఆకులు పట్టుకుంటే మాత్రం లాభం ఉంటుందా? ఆ విషయం రాశీ ఎలా మిస్ అవుతోంది?