రష్మీ... చాలా పెద్ద మనసు నీది

August 08, 2020

తెలుగు నటుల్లో రష్మీ ప్రత్యేకమైన మనిషి. సున్నిత మనస్తత్వం, తనకు సంబంధం ఉన్నా లేకున్నా... ఎవరికైనా కష్టమొస్తే కదిలిపోతుంది. అందరికీ తాను సాయం చేయొచ్చు చేయలేకపోవచ్చు. కానీ స్పందించే గుణం మాత్రం రష్మి గుండెల నిండా ఉంటుంది. కరోనా ఎఫెక్టుతో దేశమంతటా కర్ఫ్యూ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో... అసలు రోడ్డు మీద మనుషులు తిరుగుతుంటే వీధి కుక్కలు, పక్షులు, పశువులకు ఏదో ఆహారం దొరికేది. ఇపుడు మానవ సంచారం లేక ఆ జీవాలు అలమటించి పోతున్నాయని రష్మి కన్నీరు పెట్టుకుంది. కళ్లు ఎదుట ఏదో పెంపుడు జంతువుకి ఏదైనా జరిగితే బాధపడేవాళ్లను చూస్తేనే కదిలిపోతాం. అలాంటిది రష్మి కన్సర్న్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

అందరూ పేదలకు అన్నం పెట్టడానికే చూస్తున్నారు గాని వీధుల్లో తిరిగే వాటికి ఎవరు అన్నం పెడతారు అనుకుందో ఏమో పోలీసుల సాయంతో కనపడిన వీధి జంతువులకు ఆహారం తయారుచేసి పెట్టింది రష్మీ. పోలీసులు సాయంతో తాను తెచ్చిన ఆహారాన్ని కనిపించిన జంతువులు అన్నిటికీ పంచిపెట్టి తన పెద్ద మనసును చాటుకుంది రష్మి. ఈ సందర్భంగా తనకు సహకరించిన పోలీసులు, ఇతరులతో సెల్ఫీ దిగిన రష్మి దానిని ట్వీట్ చేస్తూ.. వీళ్లతో ఫొటో దిగే అవకాశం కలిగింది. అంరదివీ మంచి మనసులే. చాలా సపోర్ట్ చేశారు అంటూ వ్యాఖ్యానించింది. 

నిన్ననే ఈ విషయంపై లైవ్ లో మాట్లాడిన రష్మిగా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. అంతే వెంటనే మరుసటి రోజే వాటికి ఆహారం తయారుచేసి పంచింది. యాదృశ్చికంగా జరిగిన మరో విషయం ఏంటంటే... రష్మి సొంత రాష్ట్రం ఒడిసా ప్రభుత్వం కూడా వీధి జంతువులకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ నిధులు కూడా విడుదల చేసింది. 54 లక్షల రూపాయలు వాటి కోసం కేటాయించింది.