చిక్కుల్లో యాంక‌ర్ ర‌ష్మి..జైలు త‌ప్ప‌దా?

December 14, 2019

ప్ర‌ముఖ టీవీ యాంక‌ర్ ర‌ష్మి చిక్కుల్లో ప‌డ్డారు. తాజాగా ఆమె చేసిన యాక్సిడెంట్ ఒక వ్య‌క్తికి తీవ్ర గాయాలు పాల‌య్యేలా చేసింది. ఆదివారం రాత్రి విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవ‌ల కొత్త కారును కొన్నారు ర‌ష్మీ. విశాఖ జిల్లా గాజువాక కూర్మ‌న‌పాలెం వ‌ద్ద రోడ్డు దాటుతున్న ఒక వ్య‌క్తిని ర‌ష్మి కారుఢీ కొట్టింది. దీంతో.. ఆ వ్య‌క్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి త‌గిలిన గాయాల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఒక ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం అత‌న్ని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. అయితే..ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారును ర‌ష్మి డ్రైవ్ చేస్తున్నారా? ఇంకెవ‌రైనా చేస్తున్నారా? అన్న డిటైల్స్ బ‌య‌ట‌కు రాలేదు. తాజా ప్ర‌మాదంతో ర‌ష్మి చిక్కుల్లో ప‌డ్డార‌న్న మాట వినిపిస్తోంది.