రష్మి లేకపోతే నాకు లైఫ్ లేదు - సుధీర్ !

February 24, 2020

సినిమా వాళ్ల గాసిప్స్ బాగా పాపులర్ అవుతాయి. కానీ ఒక టీవీ గాసిప్ సినిమా రేంజ్ లో ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యిందంటే... అది రష్మీ సుధీర్ ల మధ్య సంబంధమే. ఎప్పటికపుడు వారంతట వారే ఆ గాసిప్ ను పెద్దది చేస్తారు. పోనీ ఇరువురి మధ్య ఉన్న సంబంధంపై క్లారిటీ ఇస్తారా అంటే అదీ ఇవ్వరు. ఏమీ లేదనీ చెప్పరు. దీంతో ఇది ఏళ్లకేళ్లు అలా సాగుతూనే ఉంది. సాాధారణంగా ఇలాంటి గాసిప్ ఉన్నపుడు అది అబద్ధం అని నిరూపించాలి అనుకునేవాళ్లయితే గత ఏడాది ఓ టీవీ ప్రోగ్రాంలో భాగంగా పెళ్లికూతురు, పెళ్లికొడుకులా నటించరు. అప్పటికే వారిద్దరి లవ్ ఎఫైర్ గాసిప్ ఉందని తెలిసినా ఆ పెళ్లి నాటకాన్ని రక్తి కట్టించారంటే... అదే పనిగా వాళ్లు దానికి ఒప్పుకున్నారని అర్థమవుతోంది.
ఈరోజు కూడా రష్మితో సంబంధం గురించి సుధీర్ మాట్లాడారు. కానీ ఇపుడు కూడా ఏం క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఇంకా ఆసక్తిని పెంచేలా మాట్లాడాడు. ​తాజాగా సుడిగాలి సుధీర్..తన కొత్త సినిమా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ ప్రమోషన్‌లో భాగంగా రష్మీ గురించి మాట్లాడారు. *సుధీర్ అంటే సుధీర్ టాలెంట్ గురించి ఎవరూ మాట్లాడరు. సుధీర్ అంటేనే... రష్మీ గురించే మాట్లాడతారు. రష్మీ అనే అమ్మాయి నా లైఫ్‌లో లేకపోతే నాకు జీవితమే లేదన్నట్లుంది సిట్యుయేషన్* అన్నాడు సుధీర్.
అంతేకాదు, ఆమె ప్రభావం నాపై ఎంతో ఉంది. రష్మీకి నాకు ఏడేళ్లుగా పరిచయం ఉంది అన్నారు. అయితే... ఏడేళ్లుగా ఏనాడూ వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోలేదట. ఈ మధ్యన వృత్తి పరంగా ఓ రెండుగంటల పాటు ఫస్ట్ కాల్ మాట్లాడుకున్నారట.

ఇదంతా చూస్తుంటే... వీరిద్దరి మధ్య గాసిప్ ను అలాగే ఉంచడానికి అన్ని టీవీ ఛానెళ్లు ప్రోత్సహిస్తున్నాయని పలువురి అనుమానం. అలా చేయడం ద్వారా వీరితో చేయించే ప్రోగ్రామ్ లను సూపర్ హిట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారట. సూపర్ లాజిక్ ఇది.