Gallery: రష్మిగౌతమ్ వయ్యారాలు

August 05, 2020

యాంకర్ రష్మి. జబర్దస్త్ ను కామెడీ  కోసం ఎంత మంది చూస్తారో రష్మి కోసం కూడా అంతే మంది చూస్తారు. తాజాగా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో జబర్దస్త్ షూటింగ్ మళ్లీ మొదలైంది. దీంతో ఆ షూటింగ్ సందర్భంగా రష్మి ఈ ఫొటోలు దిగింది. చీరలో వయ్యారాలు పోతోంది.రష్మి గురించి కొన్ని విషయాలు

  1. రష్మి అనిమల్ లవర్... వాటికి ఏమైనా అయితే తట్టుకోలేదు. సున్నిత మనస్కురాలు. తనకు సాయం చేసిన వారిని మరిచిపోలేదు.
  2. రష్మి ‘జబర్దస్త్’ టీవీ షో చేయడానికి ముందే కొన్నేళ్లుగా సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది రష్మి గౌతమ్. మంచి పాత్రలే చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.
  3. ‘జబర్దస్త్’లో గ్లామర్ షో చేశాక ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది.
  4. ప్రవీణ్ సత్తారు  దర్శకత్వంలో రష్మి  ‘గుంటూరు టాకీస్’ చేసింది. ఇందులో రష్మి బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా  బోల్డ్ గా కనిపించింది. అయినా పెద్దగా ఆఫర్లు రాలేదు.
  5. దీని గురించి ఆమె తర్వాత రిగ్రెట్ అయ్యింది. గుంటూరు టాకీస్’లో బోల్డ్‌గా నటించి తప్పు చేశానేమో... వరుసగా అలాంటి బోల్డ్ క్యారెక్టర్లే ఇచ్చారని.. దీంతో పాత్రల్లో వైవిధ్యం లేక తాను చేసిన సినిమాలు బోల్తా కొట్టి  కెరీర్‌కు బ్రేక్ పడిందని రష్మి చెప్పింది.
  6. టీవీ షోలు చాలానే చేస్తున్నానని.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట రష్మికి.
  7. ఆర్థికంగా సెటిలైనట్లే అయినా తాను కోరుకున్న జీవితం ఇంకా రాలేదని రష్మి చెబుతుంటుంది.
  8. లాక్ డౌన్లో  వైజాగ్‌ లోని తన సొంతింట్లోనే ఉంటున్న రష్మి వీధి కుక్కలకు రెండు పూటలా వండి పెట్టేది.