పర్సనల్ సీక్రెట్ రివీల్ చేసిన టాప్ హీరోయిన్

August 07, 2020

టాప్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్న హీరోయిన రష్మికా మందాడ. రీల్ గీత రియల్ లైఫ్ కు సంబంధించిన ఒక విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆమె నటించిన భీష్మ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ తో జత కట్టిన ఈ భామ తాజాగా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరవిషయాల్ని రివీల్ చేసింది.
ఈ ఇంటర్వ్యూ అద్యంతం సరదా సరదాగా సాగింది. ఇంటర్వ్యూ చేసేటోళ్లు అడిగిన ఒక ప్రశ్నకు షాకింగ్ సమాధానాన్ని చెప్పారు నితిన్. మీ ఇద్దరికి మాత్రమే తెలిసి వేరే వారికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలని నితిన్.. రష్మికాలను అడగ్గా.. ఆ ప్రశ్నకు తాను సమాధానం చెబుతానని ముందుకొచ్చారు నితిన్.
సాయంత్రం వేళ మీకు ఆకలేస్తే ఏం తింటారు? ఉప్మా.. ఇడ్లీ.. స్వీట్.. డిజర్ట్.. చిప్స్ ఇలా ఎవో ఒకటి తింటారు. కానీ.. రష్మిక మాత్రం కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే.. దీనికి రష్మిక తెగ ఇబ్బంది పడిపోతూ.. నితిన్ చెప్పిన సీక్రెట్ కు జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు.
తన దగ్గర ఒక పప్పీ ఉందని.. దానికి పెట్టే పెడిగ్రీ టెస్ట్ చేయాలని అనిపించిందని.. అందుకే ఒకసారి తిని చూసినట్లుగా చెప్పి నవ్వేసింది. మొత్తానికి రష్మికకు సంబంధించిన టాప్ సీక్రెట్ ను నితిన్ బయటపెట్టేశారని చెప్పాలి. కుక్క బిస్కెట్ తిన్నానని ఒక టాప్ హీరోయిన చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఈ మాట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.