కరోనాను పెంచే మరో నిర్ణయం.. ఏపీ హాహా కారాలు 

May 25, 2020

ఏపీలో వైసీపీ నేతలు కరోనాకు సూపర్ స్ప్రెడర్లుగా మారారని మనకు అనే ఉదంతాలు కనిపించాయి. ప్రభుత్వం తాను తప్పులు చేస్తూ ఇతరుల మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తోంది. కరోనా ఇంత ఘోరంగా ఏపీలో విజృంభిస్తుంటే.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం అదింకా పెరగడానికి దోహదం చేసేలా ఉంది. 

మే నెలకు గాను రేషన్ పంపిణీని ప్రారంభించిన ఏపీ సర్కారు మొన్నటి వరకు కార్డు ఆధారంగా ఇచ్చి ఇపుడు ఈ నెల నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ప్రవేశ పెట్టింది. అంటే అందరూ వేలి ముద్ర వేయాలి.  మే 10వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. వేలి ముద్రల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు మీకు ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. వేలి ముద్రల వల్ల ఊర్లో ఒక్కరికి కరోనా ఉంటే అందరికీ వచ్చే ప్రమాదం ఉందని... పాపం పేదలు దీని బారిన పడితే వారి జీవితం ఇబ్బందుల పాలవుతుందని కన్నా అన్నారు. ప్రజలు కూడా దీనిని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఒకవైపు సామాజిక దూరం అంటూనే, లాక్ డౌన్ లు పెడుతూనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే అని చెప్పొచ్చు.