రవి ప్రకాష్ కి బెయిలొచ్చింది... వెనకున్నదెవరు?

July 12, 2020

బెయిలు తెచ్చుకోవడంలో ఎట్టకేలకు రవి ప్రకాష్ సఫలం అయ్యాడు. ఇది ఎలా జరిగింది. ఒకవైపు తెలంగాణ సర్కారు స్నేహితుడి కంపెనీ అయిన టీవీ9 మేనేజ్ మెంట్ పదేపదే రవిపై కేసులు పెడుతూనే ఉంది. ఒకటి మీద ఒకటి ఆరోపణలు చేస్తూనే ఉంది. చివరకు అనుకున్నట్టు జైలుకు పంపింది. అయితే... అనూహ్యమైన అరెస్టుతో ఖంగుతిన్న రవి ప్రకాష్ పెద్దగా బెదిరినట్టు కనిపించడం లేదు. మళ్లీ అదే టీవీ9 సీఈవో అవుతానని సవాల్ విసిరారు. ఇది చాలా ఆసక్తికరమైన సవాల్. మరి ఇంత పెద్ద డైలాగ్ వచ్చిందంటే... రవి వెనుక ఏదో పెద్ద పార్టీ ఉండి తీరాలి.

ఒకవైపు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ప్రత్యర్థి బలమైన వాడు. అయినా రవిప్రకాష్ ధైర్యంగా ఉండటానికి కారణం ఎవరో ఒకరు ఉన్నారు. ఆ అండ, నిరంతర ప్రయత్నం వల్లే ఈరోజు రవి ప్రకాష్ కి బెయిలు వచ్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఈరోజు రవికి బెయిలు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన కోర్టు...గట్టి షరతులు పెట్టింది. హైదరాబాదును విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా... తెలంగాణలో మెల్లగా కేసీఆర్ ప్రభ తగ్గుతోంది. 100 మంది ఉన్నా కేసీఆర్ కౌరవాధినేతగా మిగిలిపోయారు. కాంగ్రెస్ వాళ్లు గట్టిగా పోరాడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ విషయంలో కేసీఆర్ తెలివితేటలను అతని ఇగో డామినేట్ చేసింది. ఈ సందర్భాన్ని బీజేపీ కూడా గట్టిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 

అందుకే బీజేపీ కేసీఆర్ అంటే గిట్టని వారికి అన్ని విధాల అండగా నిలబడుతోంది. కేసీఆర్ శత్రువులకు, బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది.ఈ వర్గంలో రవి ప్రకాష్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రవి ఒక ఎంప్లాయి వంటి వ్యక్తి కావచ్చు. కానీ అతనేమీ అజ్జాని కాదు, లౌక్యం తెలియని వాడు కాదు. అలాంటి వ్యక్తి చేస్తున్న సవాళ్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం రవికి గట్టి సపోర్టు దొరక్కపోతే ఇలాంటి మాటలు మాట్లాడేవాడే కాదంటున్నారు. టీవీ9 బ్యాన్ చేసినపుడే ఇంత సీరియస్ రవి రియాక్ట్ అవలేదు. పైగా బతిమాలాడు కేసీఆర్ ని. అలాంటిది ఇపుడు ఇంత గట్టిగా నిలబడ్డాడంటే.. ఏదో గట్టి అండ ఉండి ఉంటుంది. 

Read Also

భారతీయులు ఎందుకు అవినీతి పరులు?
యువరాజకు పట్టాభిషేకం..?
ఆ వీడియోతో జగన్ రహస్యం బట్టబయలు