అఫిషియల్ - రవిప్రకాష్ టీవీ పేరు ఇదే

August 03, 2020

న్యూస్ ను ఎంటర్టైన్ మెంటుగా మార్చిన మీడియా దిగ్గజం రవి ప్రకాష్ తనకు అవమానం జరిగిన నాలుగు నెలల్లోనే నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసే ప్రయత్నం చేస్తున్నారు. తనను అవమానించిన పాత ఛానెల్ కొత్త యాజమాన్యం, వారికి మద్దతుగా ఉన్న కేసీఆర్ పై కసితో బీజేపీ అండతో ఈ ఛానెల్ వస్తున్నట్లు తెలుస్తోంది.
రవి ప్రకాష్ త్వరలో ప్రారంభించబోయే టీవీకి పేరు ఖరారుచేశారు. దానిని రవి అనచరుడు, మాజీ టీవీ9 ఉద్యోగి జకీర్ వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, న్యూమరాలజీ కూడా చూసుకుని తమ ఛానెల్ పేరును వారు ఖరారుచేశారు. ’టీవీ36‘ గా ఈ ఛానెల్ కు నామకరణం చేశారు. 9 నెంబరు రవికి బాగా కలిసిరావడం వల్లనే 36 (టోటల్ తొమ్మిది) వచ్చేలా పేరు పెట్టినట్లు అర్థమవుతోంది.

మరి పాత ఛానెల్ పక్కలో బల్లెంలా మారడానికో ఏమో టీవీ9 కు దగ్గర్లోనే టీవీ 36 ఆఫీసును ఏర్పాటుచేస్తున్నారు. ఈ విషయాన్ని జకీర్ వెల్లడించారు. ప్రస్తుతం రవి ప్రకాష్ బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే.