దిద్దుకోలేని తప్పు చేసిన కేసీఆర్ - మరో 6 నెలల్లో

June 01, 2020

ఏ నిర్ణయం ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్నింటిని గెలవడం కోసం చేసే కొన్ని పనులు గెలిచిన వాళ్లనే మింగేస్తే...??? తెలంగాణలో ఇదే జరగబోతోందని అనిపిస్తోంది. రాజకీయ నేపథ్యంతో సాగిన టీవీ9 ఎపిసోడ్ లో బలయిన రవి ప్రకాష్ కు ప్రజల నుంచి ఇసుమంతయినా సానుభూతి దక్కకపోవడం వల్ల, అత్యంత అవమానకరమైన నిష్క్రమణ వల్ల ఇపుడు తెలంగాణలో పెద్ద ఉపద్రవమే రాబోతోందని తెలుస్తోంది. అయితే, ప్రజలు అతని మీద చూపించిన కోపమూ, కొత్త యాజమాన్యము అతని మీద చూపించిన కోపమూ రవి ప్రకాష్ భవిష్యత్తులో ఒకే ఒక్కరి మీద తీర్చుకోకున్నాడు. అది ఎవరో కాదు కేసీఆర్. అంటే తెలంగాణలో వచ్చే ఉపద్రవం వల్ల ప్రజలకు ఏ కీడూ లేదు గాని మొత్తం కీడు కేసీఆర్ కే ఉండనుంది.

చరిత్ర చెబుతున్న సత్యం - గెలుపు ఎపుడూ ఒకరి వైపే ఉండదు. ఇపుడు ఇదే సత్యాన్ని కేసీఆర్ తెలుసుకునే రోజు వస్తుంది. తెలంగాణ వచ్చాక తొలిసారి బొటాబొటిగా విజయం సాధించిన కేసీఆర్ రెండో సారి సంపూర్ణమైన, అప్రతిహతమైన మెజారిటీతో విజయం సాధించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే రాష్ట్రాన్ని ప్రశ్నించినట్టు అన్న వాతావరణం సృష్టించారు. ప్రతిపక్షం బలహీనత కూడా దీనికి కారణం కావచ్చు గాని కారణం లేకుండా అందరి మీద గెలిచి కక్ష తీర్చుకునే కేసీఆర్ మనస్తత్వమే టీవీ9 రవి ప్రకాష్ అవమానాలకు ఈరోజు కారణం.

తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్పీల కోసం లైవ్ లు పెట్టి పెద్దవి చేసి చూపించిన రవి ప్రకాష్ వల్లే ఉద్యమం మరింత తీవ్రం అయ్యింది. కానీ తెలంగాణ నుంచి రవిప్రకాష్ కు ఇపుడు మద్దతు దక్కలేదు కాకపోతే అప్పట్లో కావల్సినంత టీఆర్పీ రేటింగ్ దక్కింది. కొన్ని చిన్న సంఘటనల వల్ల టీవీ9 మీద పగబట్టిన కేసీఆర్ దాన్ని నిర్బంధించాడు. అపుడు రవి ప్రకాష్ టీం బాగా తగ్గింది. తలవంచింది. అక్కడితే వదిలేసి ఉంటే... ఈనాటికి ఒక్కరూపాయి పెట్టి కొనకుండానే టీవీ9 కేసీఆర్ మాట వింటూ ఉండేది. అయితే ఎల్లకాలమూ అది తన బానిస లా ఉండాలని అనుకున్నారో ఏమో తను అనుంగుల చేత టీవీ9 గ్రూపును మొత్తం కొనిపించారు కేసీఆర్. కొంటే కొన్నారు... కానీ రవిప్రకాష్ ను అవమానించి పంపించారు. ఇందులో రవిప్రకాష్ తప్పు లేదని మేము చెప్పడం లేదు. కానీ అవమానించి పంపించింది అయితే నిజమే కదా.
ఇదే కేసీఆర్ పతనానికి నాంది కానుంది..
రవిప్రకాష్ జీవిత లక్ష్యం కేసీఆర్ పతనం అన్నట్టు సాగినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
ఇంతవరకు తెలంగాణలో రాజకీయంగా, మీడియా పరంగా ప్రశ్నించేవారు లేకపోవడంతో ఎదురులేకుండా తనకు నచ్చింది చేస్తూ వస్తున్న కేసీఆర్ గమనించాల్సిన విషయం ఏంటంటే... తనంతట తానే రవి ప్రకాష్ అనే ఒక ప్రతిపక్షాన్ని కేసీఆర్ సృష్టించుకున్నారు.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం... నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నుంచి ఐ న్యూస్ ను రవి ప్రకాష్ కొనేశారని అంటున్నారు. ఐ న్యూస్ నే కాదు, ఏకంగా టీవీ9 నే కొనగలిగినంత డబ్బులు ఇపుడు రవిప్రకాష్ వద్ద ఉన్నాయి. కానీ అతను ఊహాజనితమైన కలల వల్ల అది మిస్సయ్యింది. ఎవరు కొన్నా టీవీ9 తన వద్దే ఉంటుందనుకున్నాడు. కానీ అంతా తలకిందులైంది. అయితే, వేలకోట్లకు పడగలెత్తిన రవి ప్రకాష్ కు ఐ న్యూస్ కొనడం చాలా చిన్నవిషయం. ఈడీల్ ఇప్పటికే కంప్లీట్ అయినా కూడా ఆశ్చర్యం లేకపోవచ్చు. కానీ అదే కనుక జరిగితే... ఇక కేసీఆర్ కు తెలంగాణలో ప్రతిపక్షం ఐ న్యూస్ కానుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని వేటాడటం కోసమే ఆ ఛానెల్ ను రవి ప్రకాష్ కొనబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును భయంతో చూసీ చూడనట్లు వదిలేస్తున్న మీడియాకు కూడా రవి ప్రకాష్ చలిజ్వరం తెప్పించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఐన్యూస్ వెలికి తీసి వైరల్ చేసేనిజాలు సోషల్ మీడియాను ముంచెత్తే అవకాశం ఉంది. అపుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర మీడియా కూడా వాటిని ప్రసారం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అంటే ప్రశాంతంగా ఉన్న తన జీవితాన్ని అనవసరమైన ఇగోకు పోయి కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రమాదంలో నెట్టుకున్నాడా? చారిత్రక తప్పిదం జరిగిపోయిందా? అన్ని త్వరలో తెలుస్తుంది.

ఇక్కడ కొందరికి అనుమానం రావచ్చు. హైదరాబాదులో ఆస్తులున్నవారు కేసీఆర్ చేతికి చిక్కాల్సిందే అని. అయితే మేము విన్నది ఏంటంటే... ఆయన తన వద్ద ఉన్న మ్యాగ్జిమమ్ డబ్బు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి అక్కడే సంపదగా మార్చారట. హైదరాబాదులో ఉంటే కొన్ని స్థిరాస్థులు ఉండొచ్చు గాని... అతనికి వివిధ నగరాలు, దేశాలతో ఉన్న ఆస్తులతో పోలిస్తే హైదరాబాదులో ఉన్న ఆస్తి చాలా స్వల్పమే అంటున్నారు. అలాంటపుడు దానికి రవి ప్రకాష్ భయపడాల్సిన అవసరమే రాకపోవచ్చు అతనికి. చూద్దాం... ఈ యుద్దం ఎటు మలుపు తీసుకుంటుందో.