ప్రజలకు గుడ్ న్యూస్ - మార్కెట్ కు బ్యాడ్ న్యూస్

August 15, 2020

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్తంభించి, వ్యాపారాలు.. ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో కీలక ప్రకటనలు చేయడానికి శక్తికాంత్ దాస్ శుక్రవారం మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదడానికి ఆర్బీఐ పెట్టిన మూడో ప్రధాన మీడియా సమావేశం ఇది. మారటోరియం పొడగించడం ఇందులో కీలక అంశం.

ఈ సందర్బంగా ఆర్బిఐ గవర్నర్ చేసిన కీలక ప్రకటనల సారాంశాం ముఖ్యాంవాలుగా ఇక్కడ వివరించాం. 

* ఆర్‌బిఐ టర్మ్ లోన్‌లపై తాత్కాలిక నిషేధాన్ని 3 నెలల వరకు పొడిగించింది. అంటే ప్రతి ఒక్కరు తీసుకున్న రుణాలను మరో మూడు నెలలు కట్టాల్సిన అవసరం లేదు. కట్టకపోయినా సిబిల్ దెబ్బతినదు. పొడగింపుతో మారటోరియం ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుంది.

* ఆర్‌బిఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు 4.4% నుండి 4%, రివర్స్ రెపో 3.35% కు తగ్గించింది. 

* ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉందని ఎంపిసి అంచనా వేసింది.

* మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతానికి తగ్గింది, తయారీ కార్యకలాపాలు 21% తగ్గాయి. ప్రధాన పరిశ్రమల ఉత్పత్తి 
6.5% తగ్గిందని ఆర్బీఐ తెలిపింది.
* ఏప్రిల్ 1 నుండి 2020-21 మధ్య కాలంలో భారత విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్లు పెరిగాయి. మే 15 నాటికి విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరాయి.
* COVID-19 వ్యాప్తితో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వల్ల ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి
* కోవిడ్ 19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి.
* ఆర్బీఐ తాజా ప్రకటనలతో మార్కెట్ దెబ్బంది. 400 పాయింట్లకు పైగా పడిపోయింది. ( ఈ వార్త రాసేసమయానికి)

* ఈ రోజు ఆర్బీఐ వెల్లడించిన నిర్ణయాలను 4 వర్గాలుగా విభజించవచ్చు: మార్కెట్ల పనితీరును మెరుగుపరచడం, ఎగుమతులకు మద్దతు ఇవ్వడం, 
దిగుమతులు, రుణ సేవలకు ఉపశమనం కల్పించడం, మూలధనానికి వెసులు బాటు పెంచడం. 

* అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్ ను ఎప్పటికపుడు అంచనా వేస్తూ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని... ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.